మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూనే.. కొత్త సినిమాలో మహేష్ సరసన నటించబోతున్న విషయాన్ని బయటపెట్టింది పూజా హెగ్డే. ఈ సందర్భంగా కాస్త సరదాగా పోస్ట్ పెట్టింది. మరోసారి మహేష్ తో నటించబోతున్నాననే విషయాన్ని చెబుతూనే.. మూడో రౌండ్ కు రెడీ అంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది.
ఇక్కడ మూడో రౌండ్ అంటే మూడో మూవీ అని అర్థం. అది కూడా మహేష్ బాబుతో కాదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో. ఇంతకుముందు త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డే. ఆ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్.
ఇప్పుడు మహేష్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్. అందుకే మూడో రౌండ్ అంటూ సరదాగా జోక్ చేసింది పూజా పాప. నిజానికి ఇక్కడ త్రివిక్రమ్ మాత్రమే కాదు, హారిక-హాసిని బ్యానర్ కు కూడా ఈ మూడో రౌండ్ కామెంట్ వర్తిస్తుంది. అందుకే ఆ బ్యానర్ పేరును కూడా ట్యాగ్ చేసింది.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ అయిన వెంటనే అందులో హీరోయిన్ పూజా హెగ్డే ఫిక్స్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే త్రివిక్రమ్ కు, పూజా అంతగా నచ్చేసింది మరి. ఆమె యాక్టింగ్, సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే విధానం, క్రమశిక్షణ చూసి త్రివిక్రమ్ ఫిదా అయిపోయాడు.
అప్పట్నుంచి పూజానే రిపీట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రీసెంట్ గా మరికొంతమంది హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చినప్పటికీ.. పూజా హెగ్డే ప్రకటనతో అన్నీ క్లియర్ అయిపోయాయి.