జగన్ వైపు చూస్తున్న దేశం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎప్పుడు ఏ కొత్త పథకం ప్రవేశపెడతారా.. అని దేశంలోని మిగితా ముఖ్యమంత్రులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు.  Advertisement ఆయన వైసిపి కార్యాలయంలో…

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎప్పుడు ఏ కొత్త పథకం ప్రవేశపెడతారా.. అని దేశంలోని మిగితా ముఖ్యమంత్రులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. 

ఆయన వైసిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంను అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునే వాళ్లమన్నారు. 

అయితే, రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నిర్వాకంతో నవంబర్‌ ఒకటో తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. ఇలా చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్‌ సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని తెలిపారు. 

అలాగే, వాసవీ దేవాలయాలకు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చినట్లుగానే, ఇప్పుడు సీఎం జగన్‌ మినహాయింపులు ఇస్తున్నారని రాఘవరావు అన్నారు.