‘దేశం’ వర్గం..కక్కలేక..మింగలేక

కరవమంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది ఇండస్ట్రీలోని ప్రో తెలుగుదేశం వర్గం పరిస్థితి. ఇండస్ట్రీలో బాలయ్య-నాగబాబు మధ్య నెలకొన్న వివాదంలో, తమకు ఇష్టమైన పార్టీకి, ఆ పార్టీ నేత…

కరవమంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది ఇండస్ట్రీలోని ప్రో తెలుగుదేశం వర్గం పరిస్థితి. ఇండస్ట్రీలో బాలయ్య-నాగబాబు మధ్య నెలకొన్న వివాదంలో, తమకు ఇష్టమైన పార్టీకి, ఆ పార్టీ నేత బాలయ్యకు మద్దతుగా నిలవలేని పరిస్థితి అయిపోయింది. బాలయ్య ఏమన్నారు..భూములు పంచుకోవడానికా? అని కదా? ఇప్పుడు బాలయ్యకు మద్దతుగా నిలిస్తే, ఈ మాటకు మద్దతుగా అన్నట్లు వుంటుంది. దాంతో కేసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అవుతుంది. ఏ ఒక్కరూ కేసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని లోపాయికారీగా కమ్మ సామాజిక వర్గ పెద్దలు చేసుకున్న ఓ నియమం. అందువల్ల బాలయ్యకు మద్దతుగా నిలవలేరు.

పోనీ నాగబాబును విమర్శిద్దాం అంటే, మరోరకం బాధ. నాగబాబు ఏమన్నారు? ఆంధ్రలో చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అక్కడ జనాలు ఇప్పటికీ బాధపడుతున్నారని కదా? ఇండైరెక్ట్ గా అమరావతి వ్యవహారాన్ని కదా నాగబాబు టచ్ చేసింది. ఇప్పుడు అనవసరంగా నాగబాబును విమర్శిస్తే, ఆ విషయానికి మరింత ప్రచారం కల్పించి, జనాల దృష్టికి తీసుకువెళ్లినట్లు అవుతుంది. అందువల్ల ఇక ఆ యాంగిల్ లో అస్సలు టచ్ చేయకూడదు.

అందుకే సైలంట్ గా వుండిపోవాల్సిందే. పైగా ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. చిరంజీవి పెట్టిన మీటింగ్ కు వెళ్లిన వాళ్లలో నూటికి తొంభైశాతం మంది అస్మదీయులే. వాళ్లెవరు ఇప్పుడు మెగాస్టార్ తరపున మాట్లాడతారా? అన్నది సందేహం. ఈ పెద్దలంతా మౌనమే తమ వ్రతం అన్నట్లు వుండిపోతారు. ఆ విధంగా ఎక్కడివారు అక్కడే గప్ చుప్ అయిపోతారు. లేదూ అంటే ఇక్కడ కేసిఆర్ కు కోపం వస్తుంది అక్కడ అమరావతి రచ్చకెక్కుతుంది.

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు