Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్లాన్ తో రమ్మనమని జగన్ పిలుపు?

ప్లాన్ తో రమ్మనమని జగన్ పిలుపు?

టాలీవుడ్ సమస్యల మీద చర్చించేందుకు ఎప్పుడైనా రావొచ్చని ఆంధ్ర సిఎమ్ జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి బృందానికి పిలుపు అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర సిఎమ్ జగన్ కాంట్రాక్టు చేసినట్లు తెలుస్తోంది. దానికి జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు బోగట్టా.

సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయం చర్చించేందుకు ఎప్పుడైనా రావొచ్చని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ముందు టాలీవుడ్ తన నుంచి ఏం ఆశిస్తోందో, అలాగే ఆంధ్రలో సినిమా రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారో డిటైల్డ్ ప్లాన్ తో రావాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సినిమా పరిశ్రమను విశాఖలో డెవలప్ చేయాలన్న ఆలోచన వుందని, అది దృష్టిలో పెట్టుకుని, టూరిజం మంత్రిగా పని చేసిన అనుభవంతో సరైన ప్లాన్ తో రావాలని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు బహుశా జూన్ తొలివారంలో అపాయింట్ మెంట్ తీసుకుని ఇండస్ట్రీ బృందం అమరావతికి పయనం అవుతుందని బోగట్టా. మళ్లీ వీళ్లను తీసుకెళ్లారు. వాళ్లని వదిలేసారు అనే మాట రాకుండా ఎవరెవర్ని తీసుకెళ్లాలి అనే విషయం మీద మెగాస్టార్ బృందం ఇప్పడు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?