తన సినిమా 'కబీర్ సింగ్' పై ఫెమినిస్టులు విషం కక్కుతున్నారని వాపోతున్నాడు షాహిద్ కపూర్. ఈ మేరకు అతడు బాలీవుడ్ గత ఉదాహరణలను కూడా ప్రస్తావించాడు. అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాలో హీరోయిన్ పై హీరో చేయి చేసుకోవడాన్ని మహిళా మణులు తప్పు పట్టారు.
ఆ అంశంపై హీరోయిన్లు కూడా ఘాటుగా స్పందించారు. విడ్డూరం ఏమిటంటే ఐటం గర్ల్స్ లా చిందేసిన వాళ్లు కూడా ఆ సీన్లను తప్పు పట్టేంత వాళ్లు అయిపోయారు. ఈ నేపథ్యంలో షాహిద్ కపూర్ ఎదురుదాడి చేశాడు.
తన సినిమానే ఎందుకు అలా చూస్తున్నారు? ఇది వరకూ వచ్చిన బాలీవుడ్ సినిమాల కథేంటి అని ఆ హీరో ప్రశ్నించాడు. అందుకు గానూ 'సంజూ' సినిమాను ప్రస్తావించాడు షాహిద్. సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన 'సంజూ'లో హీరో చేత మూడు వందల మంది అమ్మాయిలతో గడిపినట్టుగా ఒక డైలాగ్ చెప్పించారు. ఒక బాలీవుడ్ సినిమా బయోపిక్ లో అలాంటి డైలాగ్ ను చెప్పించారు.
అప్పుడంతా ఎవ్వరూ స్పందిచలేదు. ఆ విషయాన్నే షాహిద్ కపూర్ గుర్తు చేశాడు. తన మీద అయితే విరుచుకుపడుతున్నారని.. సంజూ విషయంలో మాత్రం ఎవరూ ఎందుకు స్పందించలేదని షాహిద్ అంటున్నాడు. మొత్తానికి విమర్శలను తిప్పి కొట్టేందుకు సంజయ్ దత్ సినిమాను ఉదాహరిస్తూ ఎదురుదాడి చేస్తున్నాడు షాహిద్.