అప్పుడు నోరు జారేవారు, ఇప్పుడు స్థాయి జారారు

మంత్రిగా ఉన్నప్పుడే లోకేష్ కాస్తో కూస్తో హుందాగా ఉండేవారేమో. నోరుజారినా ట్విట్టర్ లో మాత్రం మరీ స్థాయి జారి ట్వీట్లు పెట్టలేదు. ఓడిపోయిన తర్వాత, పార్టీకి అధికారం పోయాక లోకేష్ పరిస్థితి మరీ తీసికట్టుగా…

మంత్రిగా ఉన్నప్పుడే లోకేష్ కాస్తో కూస్తో హుందాగా ఉండేవారేమో. నోరుజారినా ట్విట్టర్ లో మాత్రం మరీ స్థాయి జారి ట్వీట్లు పెట్టలేదు. ఓడిపోయిన తర్వాత, పార్టీకి అధికారం పోయాక లోకేష్ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. ఆయన ట్వీట్లు చూస్తుంటే టీడీపీ నేతలు, కార్యకర్తలకు సైతం వెగటు పుడుతోంది. ట్విట్టర్ లో సీఎం జగన్, వైసీపీపై లోకేష్ చేస్తున్న విమర్శలు మరీ చీప్ గా ఉంటున్నాయని విమర్శిస్తున్నారు నెటిజన్లు.

ఇటీవల ఆయన పెట్టిన ఓ పోస్టింగ్ విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతోంది. రాష్ట్రంలో కరెంటు కష్టాలున్నాయని, వాటికి జగన్ కారణమనేది దీని సారాంశం. కేవలం టెక్ట్స్ మెసేజ్ తో పోస్టింగ్ పెడితే ఆయన లోకేష్ ఎందుకవుతారు, తన స్థాయికి తగ్గట్టు ఓ చీప్ వీడియో ఒకటి క్రియేట్ చేసి వదిలారు. ఓ ఇంట్లో స్విచ్ బోర్డ్ లో అన్ని స్విచ్ లు వేస్తుంటే, ఎక్కడా లైటు, ఫ్యాన్, ఏసీ ఏదీ పనిచేయకుండా ఉండటం దీని సారాంశం.

అంటే ఇంట్లో కరెంటు లేదని చెప్పడానికి ఈ సోది వీడియో రికార్డ్ చేశారు, దీనికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా రావాలి జగన్, కావాలి జగన్ పాటను వదిలారు. “జగన్ గారూ మీరేమో అసెంబ్లీలో జబ్బలు చరుచుకుని ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీలవుతున్నారు, బయటచూస్తే ప్రజలు రావాలి కరెంట్, కావాలి కరెంట్ అంటూ మీ ప్రభుత్వాన్ని బ్రతిమిలాడుతున్నారు. కాస్త చీకట్లో నుంచి బైటకు వచ్చి జనానికి కరెంటు ఇవ్వండి” అంటూ పోస్టింగ్ పెట్టారు.

ఇలాంటి చీప్ ట్రిక్ తో తానేదో గొప్పపని చేసినట్టు ఫీలయ్యారు లోకేష్. అయితే నెటిజన్లు మాత్రం కాస్త ఘాటుగానే తగులుకున్నారు. వీడియో తీసేముందు మెయిన్ స్విచ్ వేసుంటే కరెంటు ఉందో లేదో తెలిసుండేది అని ఒకరు అంటే, ఏసీకి కూడా మామూలు స్విచ్ వేస్తారా మందళగిరీ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఆ ఇంటి వాళ్లు కరెంటు బిల్లు కట్టలేదేమో, ముందు ఆ సంగతి చూడండి అంటూ మరొకరు సెటైర్లు వేశారు.

మొత్తమ్మీద లోకేష్ ట్వీట్ మాత్రం రివర్స్ లో వైరల్ గా మారింది. ఇదొక్కటేకాదు, ఇటీవల కాలంలో చినబాబు ట్వీట్ల వ్యవహారం అంతా మరీ చీప్ గా కనిపిస్తోంది. కార్యకర్తలు కామెడీ కోసం చేసినవన్నీ తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టేసి కామెడీ అయిపోతున్నారు లోకేష్. అయితే నెటిజన్లు మాత్రం ఇలాంటి చీప్ వ్యవహారాలపై బాగానే మండిపడుతున్నారు. ఇకనైనా చినబాబు ఇలాంటి వాటికి దూరంగా ఉండి, నాలుగు పదాలైనా మీడియా ముందు కూడబలుక్కుని మాట్లాడితే బాగుంటుందని సలహాలిస్తున్నారు.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!