మోడీకి లేఖ సౌత్ నుంచి వాళ్లిద్దరూ!

చెలరేగుతున్న మూక హత్యలపై గళంవిప్పిన ప్రముఖుల్లో దక్షిణాది వారు ఇద్దరు ప్రముఖంగా కనిపిస్తున్నారు. దేశంలో కొన్నివర్గాల వారిని లక్ష్యంగా చేసుకుంటూ సాగుతున్న దాడులను తప్పుపడుతూ అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మోడీకి లేఖ…

చెలరేగుతున్న మూక హత్యలపై గళంవిప్పిన ప్రముఖుల్లో దక్షిణాది వారు ఇద్దరు ప్రముఖంగా కనిపిస్తున్నారు. దేశంలో కొన్నివర్గాల వారిని లక్ష్యంగా చేసుకుంటూ సాగుతున్న దాడులను తప్పుపడుతూ అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మోడీకి లేఖ రాశారు కొంతమంది ప్రముఖులు. మొత్తం నలభై ఒక్క మంది ప్రముఖులు ఈ అంశంలో మోడీకి లేఖ రాశారు.

వారిలో దక్షిణాదికి సంబంధించి ఇద్దరు ప్రముఖులున్నారు. వారే దర్శకుడు మణిరత్నం, తమిళనటుడు సూర్య. ఇటీవల 'జై శ్రీరామ్' అంటూ నినదించాలంటూ కొంతమందిపై ఉత్తరాదిన మూకదాడులు జరిగాయి. ఊరికే కొట్టి వదిలిపెట్టే దాడులు కావవి. హింసాత్మకమైన చర్యలు. అలాంటి పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

బీజేపీ హయాంలో గత ఐదేళ్లలోనూ అలాంటి సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రముఖులు స్పందించారు.

అప్పట్లో అవార్డ్ వాప్సీ ఉద్యమం నడించింది. అలాంటి వాళ్లంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ బీజేపీలోని కొంతమంది వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ కొంతమంది ప్రముఖులు, మేధావులు మోడీకి మూక దాడులపై లేఖ రాశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!