ఇటీవల తన మాజీ భర్త పవన్‌కల్యాణ్‌పై పాజిటివ్ వీడియోతో పాటు చిన్న నెగెటివ్ మాట కూడా రేణుదేశాయ్ మాట్లాడారు. ఆమె వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓ నెటిజన్ మాత్రం ఘాటు కామెంట్ చేయడం, దానికి రేణు స్పందిస్తూ తనపై తిట్లను స్టార్ట్ చేయాలని, వాటిని కొనసాగించాలంటూ బాధతో, ఆవేదనతో చెప్పుకొచ్చారు. అసలు వివాదానికి దారి తీసిన పరిస్థితులేంటో తెలుసుకుందాం.
ఇటీవల సోషల్ మీడియాలో రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో పవన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్ డబ్బు మనిషి కాదని, సమాజం విషయంలో బాధ్యతగల నాయకుడని, ఒకసారి అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఇదే సందర్భంలో తన విషయంలో మాత్రం పవన్ మోసగించాడని తేల్చి చెప్పారు. ఈ ఒక్క మాట తప్ప, మిగిలినవన్నీ పాజిటివ్‌గా చెప్పినా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ వీడియో నెటిజన్ ఘాటు కామెంట్ రేణు మనసును బాధపెట్టింది. అందుకే పవన్‌కల్యాణ్ తన్ని తరిమేశాడు మేడమ్ అని కామెంట్ చేశాడు. దీనిపై రేణు రియాక్ట్ అయ్యారు. తనను తిట్టడం వల్ల మనశ్శాంతి దొరికిందా? అని ఆమె ఆవేదనతో ప్రశ్నించారు. ఒకవేళ దొరక్కపోతే ఇంకా తిట్టాలని నిష్టూరమాడారు. తన మాజీ భర్త అభిమానులు, అలాగే ఆయన వ్యతిరేకుల నుంచి తిట్లు తినడానికి తన జీవితం ఉందని ఆమె వాపోయారు.
తానెప్పుడూ అబద్ధాలు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. నిజాలు చెప్పినందుకు, నిజంగా ప్రేమించినందుకే తనకు ఈ విధంగా శాస్తి జరగాలని ఆమె తెలిపారు. తనపై తిట్లను స్టార్ట్ చేయాలని ఆమె కోరడం చర్చనీయాంశమైంది. రేణుదేశాయ్ ఇబ్బందులపై కొందరు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.