అవును నిజమే…బాలయ్య కనుక నో అంటే రవితేజ లక్కీనే. ఎందుకంటే మంచి ప్రాజెక్టు…మంచి బ్యానర్ కు రవితేజ ఇప్పుడు సెకెండ్ ఆప్షన్ గా వున్నాడు. అయ్యప్పన్ కోషియమ్ సినిమా రీమేక్ సంగతే ఇది. సితార బ్యానర్ లో నిర్మించే ఈ సినిమాకు బాలకృష్ణ-రానా అన్నది ఫస్ట్ ఆప్షన్. రానా రెడీ పృద్వీరాజ్ క్యారెక్టర్ చేయడానికి. కానీ బాలయ్య సినిమా చూసి కానీ ఏ సంగతీ చెప్పలేనన్నారు. ఆయన చూసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఆయన కనుక పాటలు, హీరోయిన్ లేని ఈ పాత్ర తనకు ఇష్టం వుండదు అని చెబితే, ఎలా అన్నది పాయింట్. అందుకే రవితేజ ను రెండో ఆప్షన్ గా పెట్టుకున్నారని బోగట్టా.
అయ్యప్పన్ కోషియమ్ లో పోలీస్ పాత్రకు రవితేజ పక్కా యాప్ట్ అనే అనుకోవాలి. రవితేజ కు సరైన సినిమా పడి చాలా కాలం అయింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో టాగోర్ మధు నిర్మిస్తున్న క్రాక్ సినిమా మీదే ఆశలన్నీ వున్నాయి. ఇలాంటి టైమ్ లో సితారలో సినిమా ఫిక్స్ అయితే లక్కీనే. మంచి పాత్ర, మంచి సినిమా, మంచి బ్యానర్ కాబట్టి.
ఇదంతా బాలయ్య నో అనడం మీద ఆధారపడి వుంటుంది. కరోనా టైమ్ ముగుస్తోంది కాబట్టి బాలయ్య సినిమా కనుక చూస్తే, ఏదో ఒకటి తేలిపోయి, ఓ పనైపోతుంది.