సలార్ సినిమా విడుదల మరో నలభై రోజుల్లో వుంది. ఇంత వరకు యూనిట్ వైపు నుంచి చడి చప్పుడు లేదు. కేజిఎఫ్ 2 కి అంత హడావుడి చేసిన సంస్థ, సలార్ కు ఎందుకిలా మౌనం వహిస్తోంది.
కేజిఎఫ్ 2 టీజర్, ట్రయిలర్ విడుదలకు నిర్మాతలు చేసిన హడావుడి మామూలు హడావుడి కాదు. నేషనల్ మీడియా మొత్తాన్ని బెంగళూరు తరలించారు. అలాంటిది సలార్ టీజర్‌ను సైలంట్‌గా ఆన్ లైన్లోకి వదిలేసారు. మరి ఆ తరువాత ఇక ఏ హడావుడి లేదు.
సినిమాలు ఒక్క పాటనే వుంటుందని తెలుస్తోంది. అది తల్లి మీద సాంగ్ బాగుంటుందని టాక్. మిగిలిన రెండు మూడు పాటలు బ్యాక్ గ్రవుండ్ స్కొర్ టైప్ లో వస్తుంటున్నారు.
ఏది ఏమైనా, ఎలాంటి పాటలు ఎన్ని వున్నా, ప్లాన్డ్గా విడుదల చేయాలి కదా? కానీ యూనిట్ అలాంటి ప్లాన్లు ఏవీ చేస్తున్నట్లు లేదు. పాటల పని మీద రచయిత కెకె మంగుళూరు సమీపంలోని మ్యూజిక్ డైకర్టర్ స్టూడియోకి వెళ్లారు.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సాంగ్ విడుదల ఏమీ వుండదు. సెప్టెంబర్ తొలివారం నుంచి ప్రచారం ప్రారంభించి, తరువాత ట్రయిలర్ వదులుతారు. పాటలు ఏవీ విడుదల వుండకపోవచ్చు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగించే వార్తే?