ఈ వారంలో విడుదల కాబోతున్న 'డియర్ కామ్రేడ్'పై బాలీవుడ్ కన్ను పడినట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అంటున్నాడట బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జొహార్. ఇటీవలే బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా 350 కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తాజా సినిమాను రీమేక్ చేయడానికి కూడా అక్కడి వారు ఉత్సాహంగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే కరణ్ జొహార్ ఈ సినిమాను వీక్షించినట్టుగా తెలుస్తోంది.
సినిమా సూపరని, దాన్ని తను రీమేక్ చేయాలని అనుకుంటున్నట్టుగా కరణ్ ప్రకటించినట్టుగా 'డియర్ కామ్రేడ్' యూనిట్ ప్రకటించింది. మరి నిజంగానే రీమేక్ చేస్తారా లేక ప్రమోషన్ కోసం ఇలా చెప్పారా? అంటే.. అది సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులు తీర్పు వస్తే కానీ క్లారిటీ రాని అంశమే!