బొల్లినేని గాంధీపై ఈడీ కేసు, మరిన్ని చర్యలు!

ఈడీలో ఆయన ఉద్యోగి. ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని చాలామందికే నోటీసులు ఇచ్చారు! ప్రముఖుల కుటుంబీకులను టార్గెట్ గా పెట్టుకుని సైతం నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా వ్యవహరించి ఆయన రాజకీయ…

ఈడీలో ఆయన ఉద్యోగి. ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని చాలామందికే నోటీసులు ఇచ్చారు! ప్రముఖుల కుటుంబీకులను టార్గెట్ గా పెట్టుకుని సైతం నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా వ్యవహరించి ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ అధికారిగా బొల్లినేని గాంధీ ప్రతీకార చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. అప్పుడే ప్రధానమంత్రి వరకూ ఫిర్యాదులు వెళ్లాయి.

అయినా లెక్కచేయని ఆయన అసలు కథ ఇటీవలే బయటకు వచ్చింది. ఇటీవలే భారీ స్థాయి ఆస్తులతో పట్టుబడిన బొల్లినేని గాంధీపై ఈడీ కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. అక్రమాస్తుల వ్యవహారంలో ఈయనపై ఈడీ చర్యలకు ఉపక్రమించింది. ఇటీవలే తమ వ్యవస్థను తాము ప్రక్షాళన చేయడంలో భాగంగా భారీఎత్తున సీబీఐ, ఈడీ స్థాయి అధికారులపై అవే శాఖల రైడ్స్ జరిగాయి.

ఆ రైడ్స్ లో పట్టుబడిన వారిలో ఈ బొల్లినేని ఒకరు. ఈయన ఆస్తులు గత పదేళ్లలో రికార్డు స్థాయికి పెరిగాయని ఈడీ గుర్తించింది. ఇరవై లక్షల రూపాయల స్థాయి నుంచి రెండు వందల కోట్ల రూపాయల రేంజ్ కు ఎదిగారట బొల్లినేని. ఈ నేపథ్యంలో ఈ అక్రమాస్తుల సంపాదన వెనుక రహస్యం ఏమిటో చేధించేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈయన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ మెంట్ కు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. 

దేవరకొండ గురించి రష్మిక చెప్పిన ముచ్చట్లు

నటుడి కంటె నాయకుడికే ఎక్కువ కష్టం