‘ఇస్మార్ట్’ టిక్ టాక్ వాడకం

బహుశా టాలీవుడ్ లో టిక్ టాక్ యాప్ పేరు తొలిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఇస్మార్ట్ శంకర్ తోనే కావచ్చు. అఫీషియల్ పార్ట్ నర్ గా టిక్ టాక్ యాప్ పేరు ప్రకటించారు. ఇప్పడు…

బహుశా టాలీవుడ్ లో టిక్ టాక్ యాప్ పేరు తొలిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఇస్మార్ట్ శంకర్ తోనే కావచ్చు. అఫీషియల్ పార్ట్ నర్ గా టిక్ టాక్ యాప్ పేరు ప్రకటించారు. ఇప్పడు జనాల్లో టిక్ టిక్ కు వున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. పూరి టిక్ టాక్ ను బాగా ఫాలో అవుతారు. అందుకే ఆయన తన సినిమా ఇస్మార్ట్ శంకర్ కు ఇస్మార్ట్ గా టిక్ టాక్ ను ప్రచారానికి వాడుకున్నారు.

ఎన్నికల టైమ్ లో వైకాపా టీమ్ టిక్ టాక్ ను అద్భుతంగా వాడుకుంది. సినిమాల్లో మళ్లీ ఇలా వాడుకున్నది ఇస్మార్ట్ శంకర్ నే. టిక్ టాక్ ఓపెన్ చేస్తేచాలు ఇస్మార్ట్ సాంగ్స్ కి, డైలాగ్ లకు అనేక వీడియోలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు జస్ట్ కొంతవరకే టిక్ టాక్ ఇస్మార్ట్ శంకర్ కోసం ఉపయోగపడితే, ఆఫ్టర్ రిలీజ్ మాత్రం మూడువంతులు ఉపయోగపడుతోంది.

టిక్ టాక్ లో అమ్మాయిలు సైతం రామ్ చేస్తున్న డ్యాన్స్ లు, రామ్ డైలాగులతో తెగ హల్ చల్ చేస్తున్నారు. దాంతో బి,సి సెంటర్లలో ఇవి వైరల్ గా మారి ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్లకు సాయం పడుతున్నాయి. మాస్ సినిమాలకు ఇకపై టిక్ టాక్ కూడా ఓ ప్రచార సాధనంగా మారుతుందేమో?

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి