నో అన్న నాని..ఎస్ అన్న శర్వా!

వైవిధ్యమైన క్యారెక్టర్లు వస్తే చేయడానికి ముందు వుంటారు హీరో నాని. కానీ మంచి దర్శకుడు, మంచి ప్రాజెక్ట్.. మంచి క్యారెక్టర్ అయినా నో అనేసారు. జై భీమ్ దర్శకుడు.. రజనీ.. అమితాబ్ కాంబినేషన్. మరి…

వైవిధ్యమైన క్యారెక్టర్లు వస్తే చేయడానికి ముందు వుంటారు హీరో నాని. కానీ మంచి దర్శకుడు, మంచి ప్రాజెక్ట్.. మంచి క్యారెక్టర్ అయినా నో అనేసారు. జై భీమ్ దర్శకుడు.. రజనీ.. అమితాబ్ కాంబినేషన్. మరి ఎందుకు నో అన్నారు అంటే అది.. విలన్ పాత్ర కావడం. అలా అని విలన్ గా నటించార‌ని కాదు. ఓ సారి నటించి దెబ్బతిన్నారని. 

విలన్ షేడ్స్ వున్న పాత్రను తొలిసారి ఎంతో ప్రేమించి చేసారు నాని ‘వి’ సినిమాలో. ఇంద్రగంటి అందించిన ఆ సినిమా జనాలకు ఎక్కలేదు. అందుకే ఇప్పట్లో విలన్ క్యారెక్టర్ చేయకూడదని డిసైడ్ అయిపోయారు నాని.

ఇలాంటి టైమ్ లో ఈ ఆఫర్ వచ్చింది. అటు అమితాబ్.. ఇటు రజనీ.. మధ్యలో విలన్ క్యారెక్టర్. నాని కాస్సేపు ఊగారు. కానీ చివరకు నో అన్నారు. ఇప్పుడు ఈ ఆఫర్ శర్వానంద్ తలుపు తట్టింది. వెంటనే ఓకె చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం ఫైనల్ స్టేజ్ లో వుంది. ఇది కనుక క్లిక్ అయితే శర్వా కెరీర్ మలుపు తిరుగుతుంది.

యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు చాలా మంది ఇలా విలన్ షేడ్స్ వున్న పాత్రలు ట్రయ్ చేసిన వారే. కొంతమంది సక్సెస్ అయ్యారు. కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి.