టిటిడితో బిజేపి భానుప్రకాష్ రెడ్డికి వివాదం ఎందుకు…

నాలుగున్నర సంవత్సరాలుగా సైలెంట్ గా వున్న వ్యక్తి.. ఇప్పుడు లేని వివాదాలను తెర మీదకు ఎందుకు తీసుకువస్తూన్నాడు. అసలు భాను ఆరోపణలలో నిజమెంతా.. వాటి వెనుక వున్న ఉద్దేశం ఎంటి? Advertisement తిరుమల తిరుపతి…

నాలుగున్నర సంవత్సరాలుగా సైలెంట్ గా వున్న వ్యక్తి.. ఇప్పుడు లేని వివాదాలను తెర మీదకు ఎందుకు తీసుకువస్తూన్నాడు. అసలు భాను ఆరోపణలలో నిజమెంతా.. వాటి వెనుక వున్న ఉద్దేశం ఎంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దేశంలో తెలియని హిందువు ఎవ్వరు వుండరు అంటే అతిశయోక్తి కాదేమో.. హిందువులకు ఆరాధ్యదైవమైన శ్రీవారు వెలసిన ప్రఖ్యాత కాంచిన పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడవలసిన భాధ్యత అందరి పై వుంది కాని హిందువులు పార్టి నేతగా ప్రచారం చేసుకునే భాను మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూన్నారు.

తన వ్యక్తిగత ప్రచారం కోసం.. రాజకీయ లబ్ది కోసం టిటిడిని అడ్డంగా వాడేసుకుంటున్నాడని భాను పై బిజేపి నేతలే ఆరోపణలు చేస్తూన్నారంటే… భాను ప్రకాష్ యొక్క వ్యవహారశైలి అర్దం చేసుకోవచ్చు. టిటిడి ప్రతిష్టని కాపాడవలసిన భాధ్యతని ప్రక్కపెట్టి.. టిటిడిని అప్రదిష్ట పాల్చేస్తూన్న భానుప్రకాష్ రెడ్డి వికృత మనసత్వాని సోంత పార్టి నేతలే అసహ్యించుకుంటున్నారు

నాలుగున్నర సంవత్సరాలుగా సైలెంట్ గా వున్న భాను ఇప్పుడు టిటిడి పై విమర్శలు చెయ్యడానికి కారణం ఎమిటి.. తెర వెనుక జరిగింది ఎమిటి అంటే.. ఇటివల తిరుపతి అభివృద్దికి టిటిడి 1 శాతం నిధులు వెచ్చించాలని పాలకమండలి నిర్ణయించింది. పాలకమండలి నిర్ణయం వెనుకు వున్న ఉద్దేశం.. శ్రీవారి భక్తులుకు తిరుపతి గేట్ వే లాంటిది.. మరో వైపు టిటిడి ఉద్యోగులు మొదలుకోని టిటిడికి సంభందించిన ఆలయాలు,విద్యాలయాలు,హస్పిటల్స్ అన్ని కూడా తిరుపతిలోనే వున్నాయి.దినితో శ్రీవారి భక్తులుకు సౌకర్యాలను మరింతగా పెంపోందించడానికి తిరుపతి అభివృద్దిలో టిటిడి భాగస్వామ్యం వహించాలని భావించింది పాలకమండలి.

టిటిడి నిర్ణయం పై శ్రీవారి భక్తులే కాకూండా తిరుపతి వాసులు కూడా ఎంతగానే సంతోషించారు.. సంభరపడిపోయ్యారు. పాలకమండలి నిర్ణయంతో తిరుపతిలో భక్తులుకు మరిన్ని వసతులు కల్పించే అవకాశం ఏర్పడుతుందని.. తద్వారా తిరుపతి అభివృద్ది చెందుతుందని తిరుపతి వాసులు భావిస్తే.. తన స్వలాభం కోసం తిరుపతి అభివృద్దిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసాడు భానుప్రకాష్ రెడ్డి

టిటిడి పై విమర్శలు చెయ్యడానికి గోతి కాడా నక్కల కాచుకునే వుండే భానుప్రకాష్ రెడ్డి తన అసలు స్వరూపాని భయటకి తీసాడు.. అసలే ఎన్నికల సీజన్ కూడా కావడంతో అందుకు టిటిడిని వేదికగా చేసుకున్నాడు. ప్రజలను తప్పుదారి పట్టించేలా తిరుపతి అభివృద్ది పేరుతో టిటిడి నిధులు ప్రక్కదారి పట్టిస్తూన్నారంటు తప్పుడు ఆరోపణలు చెయ్యడం ప్రారంభించాడు.. తిరుపతి అభివృద్దికి రాష్ట్ర‌ ప్రభుత్వం నిధులు వెచ్చించాలని.. అందుకు టిటిడి నిధులు కేటాయీంచడం ఎమిటి అంటు అసంభద్దమైన చర్చను తెర మీదకు తీసుకువచ్చాడు. 

తిరుపతి వాసులుతో పాటు శ్రీవారి భక్తులు టిటిడి నిర్ణయాని స్వాగతిస్తూంటే.. తిరుపతికి వలస వచ్చిన భాను మాత్రం తన స్వలాభం కోసం టిటిడి నిర్ణయాని వివాదం చెయ్యడం ప్రారంభించాడు. దీనితో టిటిడి కూడా భాను పై దృష్టి పెట్టింది.. తిరుపతి అభివృద్దిని.. తద్వారా శ్రీవారి భక్తుల సౌకర్యాలను అడ్డుకుంటున్న భాను ప్రకాష్ రెడ్డి అభివృద్దిని అడ్డుకోవాలనీ నిర్ణయించింది టిటిడి. 

భానుప్రకాష్ రెడ్డి అభివృద్దికి టిటిడికి ఏమి సంబంధం అనుకుంటున్నారా.. వుందండి.. టిటిడికి భానుప్రకాష్ రెడ్డి మధ్య వీడదీయరాని అనుబంధం వుంది.. అదే శ్రీవారి దర్శన టిక్కెట్లతో సంబంధం.

చిత్తూరు నుంచి తిరుపతికి వలస వచ్చిన భానుప్రకాష్ రెడ్డి.. తన పార్టి వారు మొదలుకోని.. బడా వ్యక్తులకు మొదట నుంచి శ్రీవారి ఆలయంలో దగ్గరుండి దర్శనాలు చెయ్యించడం.. వారు ఇచ్చిన తృణమో.. ఫణమో పోందుతు వుండే వాడు. బిజేపి నాయకుడుగానే కాకూండా.. టిటిడి పాలకమండలి సభ్యుడిగా కూడా భాను ప్రకాష్ నిత్యం సాగించిన.. చేసీన పనులు ఇవే(విటికి గురించి ప్రత్యేకంగా మరో కథనంలో తెలుసుకుందాం)

టిటిడి పై అసంబద్దమైన ఆరోపణలు చేస్తూన్న భానుకి చెక్ పెట్టడానికి రాజుగారి ప్రాణం పంజరంలో వున్న చిలుకలో వున్న చందంగా దర్శనాల కోసం భానుప్రకాష్ రెడ్డి ఇచ్చే సిఫార్సులను భేఖాతారు చెయ్యడం ప్రారంభించింది టిటిడి.

దీనితో తన సిఫార్సు లేఖలుకు విలువ లేకూండా పోవడం.. తన ఆదాయానికి గండి పడిపోవడంతో.. భానుప్రకాష్ రెడ్డి దిక్కుతోచలేదు.. కల్లు తాగిన కోతిలా టిటిడిపై ఆరోపణలు చెయ్యడం ప్రారంభించాడు.. అలాంటిదే పార్వేటి మండపం పై ఆరోపణలు పర్వం.

అసలు పార్వేటి మండపం ఎప్పటిది.. దానిని ఎప్పుడు పున:నిర్మించారు.. భాను ఇప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తూన్నాడు వంటి అంశాలు పై మరో కథనంలో తెలుసుకుందాం.