తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించిన వారిలో ప్రొఫెసర్ జయశంకర్ ముఖ్యులు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను ఊరూరా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. అందుకే ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త అయ్యారు. ఆయన్ను జయశంకర్ సార్ అని పిలుచుకుంటారంటే, తెలంగాణ సమాజానికి ఆయన పట్ల గౌరవం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ కల సాకారం చేసుకోకుండానే ఆయన మన మధ్య నుంచి సుదూరాలకు వెళ్లిపోయారు.
2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. తెలంగాణ రాష్ట్ర తొలి పాలకుడిగా ఉద్యమ నేత కేసీఆర్కు ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. అయితే ఏ ఆశయంతో తెలంగాణ సాధించుకున్నారో, అవేవీ కేసీఆర్ పాలనలో నెరవేరడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తాజా సోషల్ మీడియా పోస్టు ఆసక్తి రేపుతోంది.
అనేక అంశాలను ప్రస్తావిస్తూ… కేసీఆర్ సర్కార్ తెలంగాణ ఆశయాలను నెరవేర్చడంలో ఎలా విఫలమైందో తీవ్రంగా విమర్శిస్తూ విజయశాంతి ఓ పోస్టు పెట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికే ఉంటే…ఎలా స్పందించే వారో తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆ పోస్టులో ఏముందంటే…
“ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, మలిదశ ఉద్యమానికి ప్రాణమై నిలిచిన జయశంకర్ సార్ బతికుంటే… తెలంగాణలో నేడున్న పరిస్థితి చూసి ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుందని ఆయన కంట కన్నీరు ఏరులై పారేది. మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాల్ని పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారు. వారి ఆశయాలకు ఈ సర్కారు ఏ కాస్తయినా విలువనిచ్చిందా? సర్కారు కొలువుల కోసం గత ఏడేళ్ళలో జరి గిన ఆత్మహత్యల గురించి తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది. లక్షల సంఖ్యలో ఖాళీలున్నా భర్తీ చెయ్యడానికి మీనమే షాలు లెక్కిస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేనాటికి దేశంలోనే మనది ధనిక రాష్ట్రమని చెప్పి నేడు అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ట్రంలోని నగరాల్ని డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ లాగా ఇంకేవేవో చేసేస్తామన్నారు… తీరా చూస్తే వాన చినుకు పడితే చాలు కాలనీలకు కాలనీలే నెలల తరబడి నీట మునిగే పరిస్థితి. ఇక కోవిడ్ విషయానికొస్తే కార్పోరేట్ల దోపిడీని నిలువరిం చలేక ప్రజారోగ్యాన్ని అభద్రతలోకి నెట్టేశారు.
ఇదేనా జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ?… ఇది అధికార పార్టీకి మాత్రమే బంగారు తెలంగాణ తప్ప, ప్రజలకు కాదు. సార్ మన మధ్య ఉంటే, ఈ పాలకుల్ని గద్దెదించేందుకు కచ్చితంగా మరో ఉద్య మానికి ఊపిరులూదేవారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులో మరిన్ని విషయాలున్నాయి. ఏ మాత్రం అవకాశం ఉన్నా కేసీఆర్పై నిప్పులు చెరగడానికి విజయశాంతి వేచి చూస్తున్నారనేందుకు ఈ స్పందనే నిదర్శనం.