చిరంజీవితో సినిమాపై మరోసారి రియాక్ట్ అయ్యాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ డైరక్టర్.. చిరంజీవితో 4 సార్లు సినిమా మిస్ అయిన విషయాన్ని బయటపెట్టాడు. ఈసారి ఛాన్స్ ఇస్తే కచ్చితంగా నిరూపించుకుంటానంటున్నాడు పూరి.
“చిరంజీవి 150వ సినిమాకు ముందు ఎంటర్ టైన్ మెంట్ స్టోరీ అనుకున్నాం. మళ్లీ ఆయన మనసు మార్చుకున్నారు. సమాజానికి ఏదైనా చేద్దామని చెప్పి కత్తి సినిమాను రీమేక్ చేశారు. అదేంటో కానీ చిరంజీవి సినిమా చేద్దామని 4 సార్లు అనుకున్నాను. 4 సార్లు మిస్ అయింది. దురదృష్టం ఏంటంటే.. అందులో 2 సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.”
పూరి జగన్నాధ్, చిరంజీవి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అనగానే ఎవరైనా ఆటోజానీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ పూరి ఇప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. ఒకసారి, రెండుసార్లు కాదని.. ఏకంగా 4సార్లు చిరంజీవితో సినిమా మిస్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా చిరు ఒప్పుకుంటే 5 రోజుల్లో కథ రాస్తానని సవాల్ విసురుతున్నాడు.
చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్. ఆయనతోనే సినిమా చేయలేకపోతున్నాను. ఇప్పటికైనా చిరంజీవి ఒప్పుకుంటే 5 రోజుల్లో కథ రాస్తా. చిరంజీవికి కథ రాయడం పెద్ద సమస్యకాదు. సక్సెస్ లో ఉన్న దర్శకుడికే మహేష్ ఛాన్స్ ఇస్తాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అతడి అభిమానులతో చీవాట్లుతిన్నాడు పూరి జగన్నాధ్.
అంతకంటే ముందు ఆటోజానీ విషయంలో కూడా ఇలానే జరిగింది. తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకున్న పూరి, మహేష్ ఫ్యాన్స్ ను ఎప్పుడు చల్లారుస్తాడో చూడాలి.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..