బండ్ల కూడా బై.. బై.. నా?

కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంటున్నట్లు ఆ మధ్య ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. నిర్మాతగా మారిన తరువాత బండ్ల గణేష్ మళ్లీ సినిమాల్లో నటించలేదు. అయితే ఆ మధ్య అసెంబ్లీ…

కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంటున్నట్లు ఆ మధ్య ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. నిర్మాతగా మారిన తరువాత బండ్ల గణేష్ మళ్లీ సినిమాల్లో నటించలేదు. అయితే ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్లకు యూట్యూబ్ లో మాంచి క్రేజ్ వచ్చింది. టీవీ డిష్కషన్లలో సెంటర్ ఆప్ అట్రాక్షన్ అయ్యాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డైరక్టర్ అనిల్ రావిపూడి ఓ మాంచి పాత్రను తయారుచేసాడు. బండ్లను కలిసి సినిమాలో నటించేందుకు ఓకె అనిపించాడు. బండ్ల కూడా మళ్లీ మొహానికి రంగు వేసుకోవడానికి తెగ సరదాపడ్డాడు.

అయితే మరి ఇప్పుడు ఏమయిందో? బండ్ల పేరు వినిపించడం లేదు. సినిమాలో కీలకమైన ట్రయిన్ ఎపిసోడ్ లో, క్లయమాక్స్ లో బండ్ల కనిపిస్తాడని తెలుస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలకమైన ట్రయిన్ ఎపిసోడ్ వుంది. సుమారు రెండువారాల షూట్ అది. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ట్రయిన్ సెట్ కూడా వేసారు. ఈనెల 26 తరువాత ఈ సెట్ లో షూట్ స్టార్ట్ అవుతుంది.

మహేష్ బాబు, రష్మిక మడొన్న, రాజేంద్రప్రసాద్, రావురమేష్, కమడియన్ సత్య తదితరులు అంతా ట్రయిన్ లో ప్రయాణం చేసే లెంగ్తీ ఎపిసోడ్ అది. ఇదే ట్రయిన్ లో ఆన్ ది వే బండ్లగణేష్ కూడా ఎక్కుతాడు. ట్రయిన్ లో కామెడీ సీన్లు వుంటాయి.

ఇదీ వ్యవహారం. కానీ ఇప్పుడు బండ్ల చేస్తున్నాడో? లేదో? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. 26న షూట్ స్టార్ట్ అయినా ఇప్పటివరకు బండ్లను యూనిట్ సంప్రదించినట్లు లేదని తెలుస్తోంది. బండ్ల కూడా షూటింగ్ ఇప్పుడు కాదు అనుకుని, విదేశీ ప్రయాణం ఏదో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు యూనిట్ కాశ్మీర్ లో వుంది. అనిల్ రావిపూడి ఇక్కడకు వస్తే క్లారిటీ వస్తుందేమో?

జగన్‌ ఐఏఎస్‌ మీటింగులో 'రిసీట్‌' అనే బదులు 'రిసీప్ట్‌' అన్నాడు..