ఎలాంటి సినిమా తీసాం అన్నది మాత్రమేకాదు, ఎంత రిటర్న్ వచ్చింది అన్నది ఆలోచించే వ్యక్తి దగ్గుబాటి సురేష్ బాబు. ఆయన తన స్వంత ప్రాజెక్టు అనౌన్స్ చేసారు అంటే అంతకు ముందు భయంకరమైన కసరత్తు జరిగి వుంటుందని ఫిక్స్ అయిపోవచ్చు. ఓ బేబీ సినిమా విషయంలో విడుదలకు ముందు పలు గ్యాసిప్ లు వినిపించాయి. సురేష్ బాబు అంత సంతృప్తిగా లేరు అని. చాలామందికి సినిమా చూపించి, ఒపీనియన్లు తీసుకుని, ఎడిటింగ్ లు చేయించి వదిలారు సినిమాను.
మొత్తానికి ఓ బేబీకి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మ్యూజిక్ కాస్త వీక్ అన్న టాక్ కూడా వచ్చింది. అది కూడా సురేష్ బాబు ముందుగా అంచనా వేసిందే. అయితే ఇప్పుడు ఫైనల్ గా సురేష్ బాబు హ్యాపీ ఎందుకంటే సినిమా అనుకున్న గోల్ రీచ్ అయింది.
ఓ బేబీ సినిమా నిర్మాణానికి అన్నీకలిపి 13 కోట్ల వరకు ఖర్చు అయింది. నాన్ థియేటర్ హక్కులే 11 కోట్ల వరకు వచ్చాయి. రెండుకోట్ల రిస్క్ తో ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సినిమా విడుదలయిన తరువాత వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 17 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇంకా షేర్ వస్తోంది. రాబోయే షేర్ రిలీజ్ డెఫిసిట్ కు వెళ్లిపోతుంది అనుకున్నా, 17 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లే.
పీపుల్స్ మీడియా, సునీత తాడి, సురేష్ బాబు ముగ్గురు పార్టనర్లు. అదీకాక సురేష్ మూవీస్ ద్వారా సినిమా విడుదల కాబట్టి కనీసం 5శాతం డిస్ట్రిబ్యూషన్ కమీషన్ వుంటుంది. అంటే అలా ఇలా సురేష్ బాబుకు ఓ ఆరుకోట్ల వరకు ఓ బేబీ మీద లాభం వచ్చినట్లే.
ఇక ఇప్పుడు హ్యాపీగా వుంటారు సురేష్ బాబు. సరైన హిట్ కోసం చూస్తున్న పీపుల్స్ మీడియా కూడా ఈ సినిమాతో మంచి లాభం చేసుకుంది. లక్కీలేడీ అని ఇండస్ట్రీ జనాలతో పిలిపించుకుంటున్న సమంత బేబీ కూడా హ్యాపీనే అనుకోవాలి.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..