కీలక నవరత్నాలు.. ఇకపై అధికారికం

అధికారంలోకి ఇలా వస్తూనే నవరత్నాల అమలుపై సీరియస్ గా దృష్టిపెట్టిన సీఎం జగన్, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరో కీలక ముందగుడు వేశారు. నవరత్నాల అమలకు అత్యంత కీలకమైన 6 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టారు.…

అధికారంలోకి ఇలా వస్తూనే నవరత్నాల అమలుపై సీరియస్ గా దృష్టిపెట్టిన సీఎం జగన్, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరో కీలక ముందగుడు వేశారు. నవరత్నాల అమలకు అత్యంత కీలకమైన 6 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు కల్పించడంతో పాటు.. పనులు, సర్వీసుల్లో 50శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా బిల్లులు ప్రవేశపెట్టారు. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా బిల్లులు ప్రవేశపెట్టారు. దేశ-రాష్ట్ర చరిత్రలోనే ఈ తరహా బిల్లులు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారంటూ ఆ తర్వాత జగన్ ట్వీట్ కూడా చేశారు.

ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు వీటిలో కనీసం ఒక్క పని కూడా సక్రమంగా చేయలేదు. బీసీ కమిషన్ అంటూ దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు.. అరకొరగా నిధులు కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు దిశగా బిల్లు ప్రవేశపెట్టారు. అంతేకాదు.. ఉద్యోగాల కల్పన విషయంలో కూడా చంద్రబాబు చేతకానితనాన్ని పరోక్షంగా ప్రస్తావించారు జగన్. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాల్ని స్థానికులకే కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఇదే పనిని చంద్రబాబు చేయలేకపోయారని ఆక్షేపించారు.

జగన్ సభలో బిల్లులపై మాట్లాడుతున్నంతసేపు ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకున్న అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రకటనపై తెలుగుదేశం సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. దానిపై చర్చ జరపాలంటూ సభలో నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుల్ని అడ్డుకోవాలనే  ఉద్దేశంతోనే తెలుగుదేశం సభ్యులు ఈ చర్యకు దిగారు.

ఒకదశలో ప్రతిపక్ష సభ్యుల నినాదాలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరణ ఇచ్చిన తర్వాత తిరిగి చర్చ జరిపే సంప్రదాయం లేదని, కేవలం కీలక బిల్లుల్ని అడ్డుకునేందుకు మాత్రమే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి జరగడం చంద్రబాబుకు ఇష్టంలేదని, వాళ్లు చేయలేని పనిని తమ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక ఆందోళన చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ సభ్యుల ఆందోళనను పక్కనపెడితే.. నవరత్నాల అమలులో మరో కీలక ముందడుగు పడింది. ఈ బిల్లులకు ఆమోదం దక్కితే, నవరత్నాల అమలు ఇక అధికారికం అవుతుంది. సభలో వైసీపీదే మెజారిటీ కాబట్టి బిల్లుల ఆమోదం లాంఛనం మాత్రమే. నవరత్నాల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత నిబద్ధతతో ఉన్నారనడానికి ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయి.

జగన్‌ ఐఏఎస్‌ మీటింగులో 'రిసీట్‌' అనే బదులు 'రిసీప్ట్‌' అన్నాడు..