ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ఇప్పటికే పలు వివాదాలు నడిచాయి. ఈ సినిమా కథ తనదే అంటూ విడుదలకు ముందు కొంతమంది ఆరోపించారు. మరికొందరు ఈ సినిమా టోటల్ స్క్రిప్ట్ ను ఓ వెబ్ సైట్ లో పెట్టారు. ఇలాంటి వివాదాల నుంచి గట్టెక్కి సక్సెస్ ఫుల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు మరో వివాదం చెలరేగింది. ఈ సినిమా కాన్సెప్ట్ తనదే అంటున్నాడు ఆనందం హీరో ఆకాష్.
“ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూలకథతో 'ఇస్మార్ట్ శంకర్' వచ్చింది. ఇదే కాన్సెప్ట్ తో తెలుగు-తమిళ భాషల్లో నేను తయారుచేసిన కథ, కథనాలతో ఓ సినిమా చేశాను. అందులో నేనే హీరో. రాధ అనే మహిళా దర్శకురాలు సినిమా తీశారు. ఇది ఇప్పటికే తమిళంలో 'నాన్ యార్' పేరుతో రిలీజైంది. తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్న టైమ్ కు ఇస్మార్ట్ శంకర్ వచ్చేసింది.”
ఇలా తన కథను పూరి జగన్నాధ్ కాపీకొట్టేశాడని ఆరోపిస్తున్నాడు ఆకాష్. తన సినిమా తెలుగు వెర్షన్ కు “కొత్తగా ఉన్నాడు” అనే టైటిల్ ఫిక్స్ చేశానని, కానీ తనకు పూరి జగన్నాధ్ షాకిచ్చాడని అంటున్నాడు. దీనిపై పూరిని కలవడానికి ప్రయత్నించానని, కానీ అతడు అందుబాటులో లేకపోవడం వల్ల తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశానంటున్నాడు ఆకాష్.
ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఇస్మార్ట్ శంకర్ కథ రాసుకున్నానని పూరి జగన్నాధ్ ఇప్పటికే ప్రకటించాడు. సో.. ఆకాష్ చేసే ఆరోపణలు నిలిచే అవకాశం లేదు. కేవలం తన సినిమా పబ్లిసిటీ కోసమే ఆకాష్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా ముందుకొచ్చాడని కనిపిస్తూనే ఉంది. దీనిపై ఇస్మార్ట్ శంకర్ యూనిట్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..