రవితేజ, నితిన్, సాయిధరమ్ తేజ్ ఇలా ఇప్పటికి ముగ్గురు రుమాలు వేస్తున్నారు ఆ డేట్ కు. ఇంతకీ ఆ డేట్ ఏమిటి?
డిసెంబర్ 20…
సంక్రాంతికి భారీ సినిమాలు వస్తాయి. అది పక్కా. డిసెంబర్ ఆఖరివారం నుంచి జనాలు సంక్రాంతి మూడ్ లోకి వెళ్లిపోతారు. సినిమాల మీద దృష్టి తక్కువ వుంటుంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ తొలి, మలివారం వరకు పరీక్షల హడావుడి వుంటుంది. అందుకే డిసెంబర్ 20 మీద నిర్మాతల దృష్టిపడింది.
ప్రస్తుతం నిర్మాణంలో వున్న మీడియం సినిమా మేకర్లు అంతా డిసెంబర్ 20 మీద దృష్టిపెట్టారు. భీష్మ, ప్రతిరోజూ పండగే, డిస్కోరాజా సినిమాలు ఇప్పటికి ఈ డేట్ ను పట్టుకోవడం అన్నది టార్గెట్ గా పెట్టుకున్నాయి. అలా పట్టుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే ఇంకా అయిదు నెలల సమయం వుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా ఫినిష్ చేయచ్చు. అలాంటిది ఇప్పటికే భీష్మ, ప్రతిరోజూ పండగే సినిమా నలభైశాతం వరకు షూటింగ్ ను ఫినిష్ చేసుకున్నాయి.
రవితేజ-విఐ ఆనంద్ కాంబినేషన్ లోని సినిమా డిస్కో రాజా కూడా ఇప్పుడు ఈ డేట్ మీదే దృష్టిపెట్టింది. ముగ్గురు హీరోయిన్ల ఎంపిక, ఇతర సమస్యలతో కాస్త స్లోగా నడిచిన ఈ సినిమా ఇప్పుడు రవితేజకు వేరే ఆఫర్లు రావడంతో, స్పీడ్ అందుకుంది. ఈ సినిమాను ఫినిష్ చేసి, అజయ్ భూపతి సినిమా మీదకు వెళ్లాల్సి వుంది. అలాగే గోపీచంద్ మలినేని సినిమా ఒకటి వుంది. ఇవికాక, మరో రెండు సినిమాల మీద రవితేజ దృష్టిపెట్టారు. అందువల్ల డిస్కోరాజా స్పీడయింది. డేట్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసుకుంది.
ఇదిలావుంటే నాగశౌర్య అశ్వద్ధామ, మైత్రీ మూవీస్ ఉప్పెన తదితర సినిమాల దృష్టి కూడా ఇదే డేట్ మీద వుందని తెలుస్తోంది. మరి మొత్తానికి ఈ డేట్ ను ఒకరిద్దరు పంచుకుంటారో? ఎంతమంది వస్తారో చూడాలి.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..