ముచ్చటగా మూడోసారి ఆ నేతనే వరించిన కీలక పదవి

ముచ్చటగా మూడోసారి..  Advertisement విధేయతకు మరోసారి పట్టం కట్టిన సీఎం జగన్, ముచ్చటగా మూడోసారి ఆ నేతనే వరించిన కీలక పదవి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్…

ముచ్చటగా మూడోసారి.. 

విధేయతకు మరోసారి పట్టం కట్టిన సీఎం జగన్, ముచ్చటగా మూడోసారి ఆ నేతనే వరించిన కీలక పదవి

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ ను సీఎం వైయస్ జగన్ మరోసారి ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2019 సెప్టెంబర్ మాసంలో తొలిసారి ఈ బాధ్యతలను చేపట్టిన రత్నాకర్ 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఆపై మరో ఏడాది పాటు పదవీ కాలాన్ని ముఖ్యమంత్రి పొడగించారు. పదవీకాలం మరోసారి ముగియడంతో రత్నాకర్ నే ఈ పదవికి మళ్లీ ఎంపిక చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

ఉత్తర అమెరికా ( అమెరికా & కెనడా ) లో వున్న మనరాష్ట్రానికి చెందిన తెలుగు వాళ్ళకి సేవలు అందించే భాగంగా చేపట్టే ఈ కీలక నియామకంలో రత్నాకర్ మరోసారి చాన్స్ దక్కించుకున్నారు. క్యాబినెట్ హోదా గల ఈ పదవిని గత టీడీపీ ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామిక వేత్త కోమటి జయరాంకు కట్టబెట్టింది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి రత్నాకర్ పార్టీ విధేయుడిగా ఉన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా అమెరికాలో ముందుండి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.

2015లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి పార్టీకి విశేష సేవలు అందించారు. సీఎం వైయస్ జగన్, పార్టీలోని కీలక నేతలతోనే కాదు సాధారణ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో రత్నాకర్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.

మూడో సారి ఈ పదవి రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ కు, సహకరించి న పార్టీ లో ఇతర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం వైయస్ జగన్ తన పై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని రత్నాకర్ తెలిపారు. ఆయన తో కలిసి పని చేయడం తన అదృష్టం అని అన్నారు .

రాష్ట్ర ప్రయోజనాలు, సీఎం జగన్ గారికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా తన శక్తికి మించి కష్టపడతానని పేర్కొన్నారు. 

విద్యా  మూలం ఇదం జగత్ అన్న నానుడిని మనసావాచ నమ్ముతున్న ముఖ్యమంత్రి.. విద్య మూలం ఇదం జగన్ అన్నరీతిలో విద్యయే ప్రభుత్వానికి ప్రధాన అంశంగా భావిస్తూ.. అడుగులు వేస్తున్నారని రత్నాకర్ అన్నారు. దేశ చరిత్రలోనే విద్యా వ్యవస్థ పై ఇంతలా దృష్టి సారించిన నాయకుడు మరెవ్వరూ లేరు. మరే రాష్ట్రంలోనూ విద్య కోసం ఇన్ని పథకాలు, ఇంత ఖర్చు చేసిన దాఖలాలు లేవు. అన్ని సమస్యలకు చదువే సమాధానం అని సీఎం నమ్మడం ఆయనలోని ఓ కొత్తతరం నాయకుడిని ప్రతిబింబిస్తుంది. 

ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు శాచురేషన్ పద్దతిలో ప్రభుత్వం విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేస్తూ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రత్నాకర్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మెరిట్ ఆధారంగా కాకుండా ఏ కొందరికో ఇచ్చి భారీ అవకతవకలకు పాల్పడిందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకతకు విదేశీ విద్యాదీవెన ఒక మచ్చుతునక అన్నారు.

మనబడి-నాడు నేడు ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న 57,000 ప్రభుత్వ బడులను 12 రకాల మౌలిక సదుపాయాలతో సుందరంగా, ఉపయోగకరంగా తీర్చిదిద్దే మహాయజ్ఞాన్ని సీఎం చేపట్టారు. మారుతున్న ప్రపంచంతో పాటు మన పిల్లలు పురోగతి చెందాలని సీఎం సంకల్పించారు. మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందుకోవాలన్న గొప్ప ఆలోచనతో నాణ్యమైన విద్యతో పాటు ఇంగ్లీష్ విద్య, స్పోకన్ ఇంగ్లీష్ క్లాసులను పెట్టడం ముఖ్యమంత్రి దార్శనికతకు అద్దం పడుతోందని రత్నాకర్ అన్నారు. విద్యా వ్యవస్థను బాగుపర్చేందుకు, రేపటి తరం బంగారు భవిష్యత్తు కోసం నాడు-నేడు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విదేశీ విద్యాదీవెన తదితర పథకాలకు రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నారు.

విద్యావ్యవస్థ బాగుచేయడంతో పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, 3 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, 8 మేజర్ పోర్టుల నిర్మాణం, వ్యవసాయ-ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్, తదితర ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వచ్చే రెండేళ్లలో గొప్పగా అభివృద్ధి చెందబోతోందని, ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని పేర్కొన్నారు.