రికార్డులు ఎన్ని ఉన్నా తుక్కు కిందే లెక్కట… ?

రికార్డులు ఎవరికి కావాలి. పాలసీ పెట్టుకుని అమ్మేస్తున్నారు అంతే. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అద్భుతం జరగాలి తప్ప లేకపోతే బతికి బట్ట కట్టడం కష్టమని అంతా తాపీగా చెబుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో…

రికార్డులు ఎవరికి కావాలి. పాలసీ పెట్టుకుని అమ్మేస్తున్నారు అంతే. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అద్భుతం జరగాలి తప్ప లేకపోతే బతికి బట్ట కట్టడం కష్టమని అంతా తాపీగా చెబుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు కార్మికులు.

కానీ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డుని సాధించింది.  జులై నెలలో 540.8 టన్నుల స్టీల్ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పిందని అధికార వర్గాలు తెలియచేశాయి.

ఇది గతేడాదితో పోలిస్తే 35 శాతం అధికంగా అమ్మకాలు జరిగినట్లుగా వారు చెప్పారు. ఏప్రిల్ జూలై మధ్య 1538 వేల టన్నుల ఉక్కును విక్రయించినట్లుగా కూడా వివరిస్తున్నారు. 

ఇది గత ఏడాది కంటే ఎనిమిది శాతం అదనపు విక్రయమని కూడా గర్వంగానే ప్రకటిస్తున్నారు. కానీ ఏం లాభం, ఒక వైపు విశాఖ స్టీల్ వెలుగు దివ్యంగా ఉన్నా కూడా ప్రైవేట్ వేటు వేసి చీకటి చేసేందుకు సిద్ధంగా ఉన్న వేళ ఇవన్నీ కేవలం చూసి మురిసిపోవాల్సిందేనా అన్న వైరాగ్యం అయితే ఉక్కు కార్మిక లోకంలో కనిపిస్తోంది. చూడాలి మరి అద్భుతం ఏదైనా జరగకపోతుందా అని.