రెమ్యూనిరేషన్…తగ్గేదే..లే

కరోనా రెండు ఫేజ్ లు వచ్చాయి. మూడో ఫేజ్ కోసం వెయిటింగ్. సినిమా నిర్మాతలు అంతా వడ్డీలు మీద వడ్డీలు కట్టుకుంటూ, ప్రాజెక్టు ఖర్చును తడిసి మోపెడు చేసుకుంటున్నారు.  Advertisement థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో…

కరోనా రెండు ఫేజ్ లు వచ్చాయి. మూడో ఫేజ్ కోసం వెయిటింగ్. సినిమా నిర్మాతలు అంతా వడ్డీలు మీద వడ్డీలు కట్టుకుంటూ, ప్రాజెక్టు ఖర్చును తడిసి మోపెడు చేసుకుంటున్నారు. 

థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియక, సినిమాలను దగ్గర పెట్టుకుని కూర్చున్నారు. ఓటిటికి వెళ్దాం అంటే హీరోలు పోచుకోలు కబుర్లు చెబుతూ 'లవ్ థియేటర్స్..సేవ్ థియేటర్స్' అంటున్నారు.

థియేటర్ లేకపోతే తమ సినిమా లెక్క తెలియదు. రెమ్యూనిరేషన్ సంగతి తెలియదు. అందుకే థియేటర్..థియేటర్ అని హీరోలు కలవరిస్తున్నారు. ఓటిటికి వెళ్లిపోతాం మహా ప్రభో అంటే వద్దంటున్నారు. 

పోనీ ఆ సంగతి అలా వుంచి ప్రాజెక్టు భారం అంచనాలకు మించిపోయింది. కాస్త రెమ్యూనిరేషన్ తగ్గించుకోండి అంటే అబ్బే..సమస్యే లేదు అంటున్నారు.

తామంతా స్టేజ్ ఎక్కి కబుర్లు చెప్పడానికే తప్ప, నిర్మాతలను ఆదుకోవడం, రెమ్యూనిరేషన్ తగ్గించుకోవడం తమ వల్ల కాదని కరాఖండీగా చెప్పేస్తున్నారు. దాంతో నిర్మాతలు మళ్లీ మళ్లీ హీరోలతో సినిమాలు చేయాలి కాబట్టి మారు మాట్లాడకుండా భరిస్తున్నారు. 

ఇది కేవలం నాలుగు మాటల ఆర్టికల్ కాదు. ఓ మిడ్ రేంజ్ హీరో వ్యవహారం కూడా.