చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి మాత్రం ఇలాంటి పనులు. నటి ప్రియాంక చోప్రాను చాలా విషయాల్లో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. భర్తతో బెడ్రూమ్ లో ఏకాంతంగా ఉన్నట్టుగా కూడా ఆమె ఫోటోలు పోస్టు చేసింది ఆ మధ్య. అయినా మొగుడితో అలా ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఎవరు ఫొటోలు తీశారబ్బా.. అంటూ నెటిజన్లు చురకలు అంటించారు. భర్తతో తన ప్రేమను చాటుకోవాలని ప్రియాంక అలాంటి ఎత్తులు వేస్తే అవి అలా మిస్ ఫైర్ అయ్యాయి.
ఆ సంగతలా ఉంటే… నెటిజన్లకు ఆమె మరోసారి దొరికిపోయారు. మొగుడు పక్కన కూర్చుని బిందాస్ గా సిగరెట్ స్మోకింగ్ చేస్తున్న ప్రియాంక ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఆ ఫొటోలు ప్రియాంక తల్లి కూడా ఉంటారు. ఆమె కూడా నోట్లో చుట్ట పెట్టుకుని ఊదుతూ ఉంటారు.
అదంతా వాళ్ల వ్యక్తిగత వ్యవహారమే. అయితే ఇదే సమయంలో 'స్మోక్' విషయంలో ప్రియాంక చెప్పిన నీతులను నెటిజన్లు గుర్తుచేశారు. దీపావళి పండగ సమయంలో క్రాకర్స్ కాల్చడాన్ని ప్రియాంక గతంలో వ్యతిరేకించింది. ఆ పొగ ఆస్మా రోగులను చాలా ఇబ్బంది పెడుతుందని, కాబట్టి ఎవ్వరూ క్రాకర్స్ కాల్చవద్దని ప్రియాంక అప్పట్లో సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది!
మరి అప్పుడేమో సమాజానికి హితబోధ చేసి, దీపావళిని సంప్రదాయ రీతిలో జరుపుకోవడం పాపం అన్నట్టుగా చెప్పుకొచ్చిన ఈమె.. ఇప్పుడు స్వయంగా సిగరెట్ నోట్లో పెట్టుకుని కనిపిస్తే నెటిజన్లు ఊరికే ఉంటారా! ఒక ఆట ఆడుకుంటున్నారు.
ఆస్మా నుంచి రిలీఫ్ పొందడం ఇలాగేనా? అంటూ ఆమె ఫొటో కింద క్యాప్షన్లు పెడుతున్నారు నెటిజన్లు. దీపావళి పొగ చేటు, సిగరెట్ పోగ స్వీటా.. అంటూ ప్రియాంకపై పంచ్ లు వేస్తున్నారు. ఏతావాతా ప్రియాంక పెద్ద హిపోక్రాట్ అని మాత్రం ఈ ఫొటోతో తేలిపోతున్నట్టుంది.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..