రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2700 మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 48 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2719కు చేరింది. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 8148 శాంపిల్స్ ను పరీక్షించారు అధికారులు. కొత్తగా నమోదైన కేసుల్లో.. నాలుగు కేసులు కోయంబేడుకు చెందినవి.
ఇక కోలుకున్న వారి విషయానికొస్తే.. నిన్న 55 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 1903కు చేరింది. ఇక కరోనా వల్ల నిన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 57కు చేరింది. ప్రస్తుతం 759 మందికి చికిత్స అందుతోంది.
అటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షా 45వేలు దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 6535 కేసులు నమోదుకాగా.. 146 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4167కు చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 2436, తమిళనాడులో 805 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మృతుల సంఖ్య 1695కు చేరగా.. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యథికంగా మరణాలు (888) సంభవిస్తున్నాయి.