నటుడు నాగబాబు కూతురు, నటి నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డపై ఆయన నివసిస్తున్న అపార్ట్ మెంట్ వాసులే కేసు పెట్టారని తెలుస్తోంది. అపార్ట్ మెంట్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడంటూ చైతన్యపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారట ఆయన పక్క, పొరుగు ఫ్లాట్ ల వాళ్లు.
అయితే ప్రతిగా వారిపై చైతన్య కూడా కంప్లైంట్ చేశాడట. వారు తమ వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకువస్తూ, డిస్ట్రబ్ చేస్తున్నారంటూ వారిపై ప్రతి ఫిర్యాదు చేశాడట నిహారిక భర్త. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుధవారం రోజున నిహారిక ఇంట్లో గొడవ జరిగిందట, ఆ సమయంలో వారి ఫ్లాట్ దగ్గరకు అంత వచ్చినట్టుగా సమాచారం.
సాధారణంగా ఓ మోస్తరు అపార్ట్ మెంట్లలోనే పక్కింటి, ఎదురింటి గొడవలను ఎవరూ పట్టించుకోరు. ఏ ఇంట్లో ఎంత గొడవ జరుగుతున్నా, ఎంత శబ్దాలు వచ్చినా పట్టించుకోరు. అలాంటిది ఖరీదైన ఫ్లాట్లుండే అపార్ట్ మెంట్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది.
అపార్ట్ మెంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడంటూ చైతన్యపై కంప్లైంట్ వెళ్లడం, వాళ్లు తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ అతడు మరో కంప్లైంట్ ఇవ్వడం.. రకరకాల ఊహాగానాలకు కారణం అవుతోంది. చైతన్య ఇంట్లో గొడవ జరగడం వల్లనే అపార్ట్ మెంట్ వాసులు రియాక్ట్ అయ్యారనే మాటే హైలెట్ అవుతుండటం గమనార్హం. అది కూడా ముందుగా అపార్ట్ మెంట్ వాసులే పోలిస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేశారట!