అల వైకుంఠపురములో సినిమా కోసం తివిక్రమ్ పూర్తిగా రెడీ అయ్యేవరకు వేచివున్నాడు హీరో బన్నీ. ఆ వెయింటింగ్ కు తగ్గ ఫలితమూ పొందాడు. కెరీర్ బెస్ట్ సినిమా దొరికింది. అందుకే మళ్లీ త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి తాను రెడీ అని హింట్ ఇచ్చేసాడట.
ఎన్టీఆర్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమానో, బన్నీ సినిమానో, ఈ ఇద్దరు కాకుంటే రామ్ చరణ్ నో అనే లైనప్ మనసులో పెట్టుకుని వున్నారు తివిక్రమ్. ఇలాంటి టైమ్ లో మీరు రెెడీ అంటే ఓ సినిమా చేసేయడానికి నేను రెడీ అన్నాడు బన్నీ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
కానీ ఎన్టీఆర్ సినిమా వ్యవహారం అగమ్యగోచరంగా వుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ సినిమా చేసేద్దామా అని బన్నీ అంటున్నట్లు తెలుస్తోంది.
నిజానికి బన్నీ ఇప్పుడు పుష్ప సినిమాను సుకుమార్ తో చేయాల్సి వుంది. అది పక్కన పెట్టి అయితే త్రివిక్రమ్ సినిమా చేసేస్తాడా? లేదా ముందుగా రుమాలు వేసి వుంచుతున్నాడా? అన్నది తెలియదు.
మొత్తానికి తివిక్రమ్ వరసపెట్టి చేసుకుంటూ పోవాలే కానీ, నలుగురు హీరోలు రెడీగా వున్నారు. మార్చి మార్చి చేసుకుంటూనే వెళ్లొచ్చు. హిట్ ట్రాక్ వున్నంతకాలం.