Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అదిగో..అల్లదిగో...వెంకటేష్

అదిగో..అల్లదిగో...వెంకటేష్

కరోనా లాక్ డౌన్ పుణ్యామా అని టాలీవుడ్ అతలాకుతలం అయిపోయింది. సినిమాల షెడ్యూళ్లు అన్నీ ఏవేవో అయిపోయింది. దాంతో అసలు ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద డైరక్టర్లకు మరీ ఇబ్బంది గా వుంది. ఎందుకంటే టాప్ డైరక్టర్లు సినిమాకు 15 నుంచి 20 కోట్లు తీసుకుంటారు. ఓ ఏడాది ఖాళీగా వుండిపోయారు అంటే ఆ మేరకు ఆదాయం పోయినట్లే. 

టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ పరిస్థితి ఇలాగే వుంది. ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. కానీ ఆయన ఆర్ఆర్ఆర్ నుంచి ఎప్పుడు ఫ్రీ అవుతారోతెలియదు. జూన్ నుంచి ఆర్ఆర్ఆర్ షూట్ మొదలైతే, డిసెంబర్ కు ఫ్రీ అయిపోతా వుండమని ఎన్టీఆర్ చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఎలా లేదన్నా వచ్చే ఏడాది వరకు రావడం కష్టం కనుక ఈ లోగా హీరో వెంకటేష్ తో ఓ సినిమా లాగించేస్తానని త్రివిక్రమ్ మాట అని టాక్.

కానీ ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏమిటంటే, ఎంత త్రివిక్రమ్ సినిమా అయినా వెంకీ వ్యవహారాలు వెంకీకి వున్నాయి. నారస్ప సినిమా ఫినిష్ చేయాలి. షూటింగ్ ఇలా ప్రారంభం అయిపోగానే అలా వచ్చేయడానికి వెంకీ సిద్దంగా లేరు. నారప్ప ఫినిష్ చేసి, వెంకీ వచ్చేసరికి మళ్లీ అక్టోబర్, నవంబర్ నే వస్తుంది. అంటే ఎన్టీఆర్ సినిమా అనే వ్రతం చెడినా త్రివిక్రమ్ కు ఫలితం దక్కదు. బై మిస్టేక్ షూటింగ్ లు ఆలస్యం అయితే వెంకీ సినిమా అన్నది కూడా మళ్లీ అనుమానమే. మరోపక్క ఇప్పటికే కమిట్ అయిన ఎఫ్ 3 వుండనే వుంది. తన సినిమాను వెనక్కు నెడితే, హారిక హాసినితో దిల్ రాజు బందాలు బెడిసి కొట్టే ప్రమాదం వుంది.

వెంకీకి కావాల్సింది సోలోనే

నాని నో మరో మిడ్ రేంజ్ యంగ్ హీరోను తీసుకుని, వెంకీతో సినిమా చేస్తా అంటే ఆయన ఏమంటారో కానీ సురేష్ బాబు కాస్త గట్టిగానే ఆలోచిస్తారు. ఎప్ 2 టైమ్ లో వెంకటేష్-వరుణ్ తేజ్ క్యారెక్టర్ల విషయంలో జరిగిన హడావుడి ఇన్ సైడ్ వర్గాలకు తెలుసు. ఇది తెలిసీ నాని ఎందుకు ఊ అంటాడు? అసలు త్రివిక్రమ్ తో సోలో క్రెడిట్ లేకుండా, షేరింగ్ కు వెంకీ ఎందుకు ఊ అంటాడు. ఇలా సవాలక్ష వ్యవహారాలు వున్నాయి.

అంత వరకు అదిగో..అల్లదిగో వెంకీ-త్రివిక్రమ్ సినిమా అని వార్తలు రాసుకుంటూ వుండడం తప్ప, అంతకు మించి ఏమీ లేదు. 

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?