టీటీడీ నిరర్థక భూముల అమ్మకానికి సంబంధించి ఇంత వరకూ ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలికి కొత్త తలనొప్పి వచ్చింది. అది కూడా పాలక మండలిలోని సభ్యుడి నుంచే కావడం గమనార్హం.
టీటీడీ భూములు అమ్మవద్దని, అది హిందువుల సెంటిమెంట్‌కు సంబంధించిందని టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాకేశ్ సిన్హా కోరారు. ఈ మేరకు ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు. టీటీడీ భూముల అమ్మకంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
టీటీడీ భూములు అమ్మాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించి ఉంటే, దాన్ని రద్దు చేయాలని ఆ లేఖలో రాకేశ్ సిన్హా డిమాండ్ చేశారు. భక్తులు మనోవేదనకు గురి అవుతున్నారని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని ఆ లేఖలో రాకేష్ సిన్హా కోరారు.
కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు 2018లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో రాకేశ్ సిన్హా ఒకరు. ఆరెస్సెస్ ప్రముఖుడు, రచయిత, కాలమిస్టు అయిన రాకేశ్ సిన్హా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. థింక్-ట్యాంక్ ఇండియా పాలసీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఆ సంస్థకు గౌరవ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. జగన్ సర్కార్ ఆయన్ను టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఇప్పుడాయన పాలక మండలి నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.
ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు