తెలుగు సినిమాల్లో చిరకాలంగా ఓ మాంచి ఫోక్ సాంగ్ పెట్టాలి అంటే తెలంగాణ జానపద గీతాల వైపు చూడడం అలవాటైపోయింది. మంచి మంచి తెలంగాణ జానపద గీతాలు ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేసాయి.
మేర్లపాక గాంధీ రాయలసీమ జానపదాన్ని సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నం కొంత చేసారు. రాములో రాములా వంటి మాంచి తెలంగాణ ఫోక్ ను అందించిన మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఈసారి పాపులర్ తెలుగు జానపద గీతం 'దిగు దిగు దిగు నాగ' ను సినిమాకు అన్వయిస్తూ అందించారు.
యుంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మలతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్న 'వరుడు కావలెను' సినిమాలో తొలి సాంగ్ గా 'దిగు దిగు దిగు నాగ' విడుదలయింది.
హీరోయిన్ రీతూ వర్మ మీద చిత్రీకరించిన ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా వుంది. రీతూ వర్మను వీలయినంత అందంగా చూపించారు. పాటకు చిత్రీకరణే మరింత అందం తెచ్చింది.
అనంత్ శ్రీరామ్ జానపద గీతాన్ని సినిమా గీతంగా మార్చడంలో బాగానే సక్సెస్ అయ్యారు. పాటలో హీరో కనిపించి వుంటే ఆ లుక్ వేరుగా వుండేది. కానీ పాటలో ఆ చాన్స్ లేనట్లు వుంది.