పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ లేటెస్ట్ వీడీయో బయటకు వచ్చింది. తల్లి రేణుదేశాయ్ నే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కర్రసాము చేస్తున్నట్లుగా వున్న వీడీయో అది. ఇంతకీ విషయం ఏమిటంటే అకీరా నందన్ ఇప్పుడు తండ్రి పవన్ తోనే, ఆయన జూబ్లీ హిల్స్ ఇంట్లోనే వుంటున్నాడు.
తండ్రి నియమించిన మార్షల్ ఆర్ట్స్ కోచ్ నిత్యం ట్రయినింగ్ ఇస్తున్నారు. సుమారు ఆరున్నర అడుగుల పొడవు వున్న అకీరా తన శిక్షణలో కాలు ను అయిదున్నర నుంచి ఆరు అడుగులు లేపే రేంజ్ కు వచ్చాడని బోగట్టా. అయితే ఇప్పటికిప్పుడే అకీరాను సినిమాలకు పరిచయం చేసే ఆలోచన ఏదీ పవన్ కు లేదు.
కేవలం శిక్షణ సరిపోదని, వయస్సు, దాని రీత్యా రావాల్సిన మార్పులు కూడా అవసరం అని పవన్ భావిస్తున్నారు. అందువల్ల ఇంకా కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా.
అప్పటికి పవన్ చేతిలో వున్న సినిమాలు కూడా పూర్తవుతాయి. అప్పుడు కూడా అకీరాకు సరిపడే సబ్జెక్ట్ ఇతరత్రా వ్యవహారాల భారం అంతా పవన్ తన మిత్రుడు త్రివిక్రమ్ మీదే పెట్టారని తెలస్తోంది.