టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్లు రాణించారు. కనీసం రెండు పతకాలపై ఆశలను పెంచారు. రెజ్లింగ్ లో ఇద్దరు భారతీయులు సెమిస్ కు చేరారు. దీంతో ఈ విభాగాల్లో పతకాలపై ఆశలు పెరిగాయి.
పురుషుల 57 కేజీల విభాగంలో రవి దహియ సెమిస్ కు ఎంట్రీ ఇచ్చాడు. వరస మ్యాచ్ లలో మెరుగైన పాయింట్లను సాధించి దహియ సెమిస్ లో స్థానం సంపాదించాడు. కజకిస్తాన్ రెజ్లర్ తో దహియ తలపడనున్నాడు. తొలి, క్వార్టర్స్ మ్యాచ్ లలో రవి దహియ ఊపు చూస్తే.. ఫైనల్ కు ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక పురుషుల 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా కూడా సెమిస్ కు చేరాడు. చైనీ రెజ్లర్ పై విజయం సాధించి దీపక్ సెమీ ఫైనల్ కు ఎంట్రీ ఇచ్చాడు.
రెజ్లింగ్ లో సెమిస్ ఎంట్రీతోనే పతకం ఖాయం అయ్యే అవకాశాలున్నాయి. అయితే భారత రెజ్లలిద్దరికీ ఇంకా పతకాలు ఖాయం అని చెప్పడానికి లేదు. రెజ్లింగ్ లో రెపిచేజ్ రూల్స్ నేపథ్యంలో ఇంకా పతకాలపై క్లారిటీ లేదు. సెమిస్ లో గెలిస్తే.. మాత్రం ఘనంగా పతకాన్ని పొందే అవకాశం ఉంది. ఇద్దరు రెజ్లర్ల మీదా స్వర్ణం ఆశలు పెట్టుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా ఫైనల్స్ కు చేరాడు. క్వాలిఫైంగ్ రౌండ్లో బెస్ట్ డిస్టెన్స్ ను నమోదు చేసి నీరజ్ ఫైనల్స్ కు ఎంట్రీ ఇచ్చాడు.