పుష్ప 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన సమయం దగ్గర పడుతోంది. స్క్రిప్ట్ డిస్షషన్లు, ఫైనల్ చేయడం అన్నవి పక్కన పెడితే అసలు ఎక్కడ షూట్ చేయాలన్న చర్చలు గట్టిగా సాగుతున్నాయి.
మళ్లీ అడవుల్లో షూట్ అయితే పక్కాగా వుంది. కానీ ఏ అడవి అన్నది క్వశ్చను. మళ్లీ మారేడుమిల్లి వెళ్లడమా? మరేదైనా మంచి అటవీ లోకేషన్ చూడడమా? రెండో భాగం మీద అంచనాలు విపరీతంగా వుంటాయి కనుక విదేశీ లోకేషన్లు కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారు.
వన్స్ అటవీ లోకేషన్ ఫైనల్ అయితే షూటింగ్ ప్రారంభించే అవకాశం వుంది. లేదూ ఈ లోగా షూటింగ్ ప్రారంభించాలనుకుంటే హీరో భవంతి, ఆ వ్యవహారాలకు సంబంధించిన షూట్ హైదరాబాద్ లో కొంత వరకు చిత్రీకరించే అవకాశం వుందని తెలుస్తోంది. 2023 డిసెంబర్ లేదా 2024 సమ్మర్ టార్గెట్ గా పుష్మ 2 ను రెడీ చేస్తారు.
ఇటు దర్శకుడు సుకుమార్ కు, అటు హీరో బన్నీకి, ఇంకా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ కూ కూడా ఈ సినిమా అత్యంత ప్రతిష్టాకరం. పైగా భారీ బడ్ఙెట్ తో కూడిన సినిమా. అందువల్ల తప్పటడుగు అన్నది ఎక్కడా వుండడానికి వీలు లేదు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ మీద, మిగిలిన అన్ని వ్యవహారాల మీద తీవ్రమైన మథనం ఙరుగుతోందని బోగట్టా.