పండగ సీజన్లో సభలకు బస్సులా హవ్వ!

పండగ సీజన్లలో ఆర్టీసీకి కాసింత లాభాలు వస్తుంటాయి. స్పెషల్ బస్సుల రూపంలో టికెట్ ధరలు బాగా పెంచేసి సంస్థ లాభపడుతుంది. స్పెషల్ బస్సులు అని ప్రకటించిన తర్వాత.. ఆర్డినరీ సిటీ బస్సులను కూడా అదే…

పండగ సీజన్లలో ఆర్టీసీకి కాసింత లాభాలు వస్తుంటాయి. స్పెషల్ బస్సుల రూపంలో టికెట్ ధరలు బాగా పెంచేసి సంస్థ లాభపడుతుంది. స్పెషల్ బస్సులు అని ప్రకటించిన తర్వాత.. ఆర్డినరీ సిటీ బస్సులను కూడా అదే ఖాతాలో అధిక ధరలతో తిప్పేస్తూ ఉంటారు. 

జనం కూడా పండగల సీజన్లో ఏదో ఒక బస్సులో సొంత ఊర్లకు వెళ్లడం వారికి అవసరం గనుక, ప్రెవేటు బస్సుల దోపిడీ ఇంకా దారుణంగా ఉంటుంది గనుక, మారు మాటాడకుండా వెళుతూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో.. సరిగ్గా ఆర్టీసికి అంతో ఇంతో లాభాలు వచ్చే అదే సీజన్లో బస్సులను ఏకంగా అద్దెకు మాట్లాడేసుకుంటే వర్కవుట్ అవుతుందా? అనేది ప్రశ్న.

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఎమ్మార్పీఎస్ శనివారం నాడు మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించాలని తలపెట్టింది. నిజానికి పండగల సీజన్లో ఇంత పెద్ద భారీ సభను ప్లాన్ చేయడమే తప్పు. దీపావళి, ఆదివారం సెలవులు కలిసి రావడంతో అందరూ స్వగ్రామాలకు వెళుతుంటారు. బస్సు సర్వీసులపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఆర్టీసీ బస్సులను తాము సభకు వెళ్లడానికి అద్దెకు మాట్లాడుకున్నామని, చివరి నిమిషంలో బుకింగ్ క్యాన్సిల్ చేశారని ఏపీలో పలు ప్రాంతాలకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు అంటున్నారు. 

ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నప్పుడే.. ఏ క్షణంలో అయినా రద్దే చేసే అధికారం సంస్థకు ఉంటుందనే కండిషన్ ఉంటుంది. ఆర్టీసీ ప్రధానంగా ప్రజలకు రవాణా వసతి కల్పించడానికి ఉన్న సంస్థ. ఇలాంటి సభలకు సేవలందించడం వారి ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఆ నేపథ్యంలో ప్రజల అవసరాల తర్వాతనే అద్దెలకు ఇస్తారు గనుక.. ఆ కండిషన్ పెడతారు.

ఎమ్మార్పీఎస్ సభకు బుక్ చేసుకున్న బస్సులను క్యాన్సిల్ చేశారనే విషయాన్ని జగన్ వ్యతిరేకంగా రాద్ధాంతం చేయడానికి పచ్చ  మీడియా ప్రయత్నిస్తోంది. జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగా వీటిని రద్దు చేసిందనే భావనను కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.

అయినా సభలను ప్లాన్ చేసుకున్నప్పుడు అందుకు తగిన రవాణా ఏర్పాట్లు వారే చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ అంతో ఇంతో లాభాలు కళ్లజూసే సీజనురోజుల్లో ఈ ప్రెవేటు బుకింగులు అనుమతించి ఉంటే.. వేలాది మంది ప్రజలు అష్టకష్టాలు పడాల్సిందే కదా.. కాబట్టి.. బుకింగులు రద్దుచేసినా ఆర్టీసీ మంచి పని చేసినట్టే అనే వాదన వినిపిస్తోంది. 

పచ్చ మీడియా బాధ్యతగా ప్రజల కష్టాల గురించి ఆలోచించకుండా, జగన్ మీద బురద చల్లడానికి దీన్ని కూడా వాడుకోవడం అసహ్యంగా ఉందని పలువురు అంటున్నారు.