అనుకున్నట్లుగానే ఆగస్టు 30నే బాహుబలి ప్రభాస్ సాహో సినిమా విడుదలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు సాహో యూనిట్ నుంచి ఓ ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వాయిదా పడిందని ఇఫ్పటి వరకు సాహో యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అలాగే మళ్లీ ఎప్పుడు అన్న ప్రకటన కూడా రాలేదు.
అయితే ఈరోజు మాత్రం యూనిట్ తరపున పీఆర్ టీమ్ కానీ, జస్ట్ ఓ ప్రకటన కానీ విడుదల చేస్తారని తెలియవస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ 13కు వెళ్తే కావాల్సినంత టైమ్ పోస్ట్ ప్రొడక్షన్ కు దొరకుతుంది కానీ అలా చేస్తే సైరా సినిమాకు ఇబ్బంది అవుతుంది. ఈ రెండింటికి గ్యాప్ జస్ట్ రెండువారాలే వుంటుంది.
రెండు భారీ సినిమాల మధ్య అంత తక్కువ గ్యాప్ మంచిదికాదు. అందుకే ఆగస్టు 30నే రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అలా అయితే వినాయకచవితి కలిసి వస్తుంది. బాలీవుడ్ లో కూడా వినాయకచవితి హడావుడి గట్టిగానే వుంటుంది. అదీకాక సాహోను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేస్తామన్నారు. కనీసం ఆ నెల దాటకుండా వేసినట్లు అవుతుందని ఇలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏ విషయం మరో గంటా రెండు గంటల్లో ఏ సంగతీ తెలిసే అవకాశం వుంది.