Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెచ్చిపోయిన రెజీనా

రెచ్చిపోయిన రెజీనా

అందాలు ఆరబోసే అవకాశం ఇవ్వాలే కానీ రెజీనా ఒక్క అడుగు కాదు, ఒక్క అంగుళం కూడా వెనక్కు వేయదు. గతంలో రెండు మూడు సినిమాల్లో ఈ వ్యవహారం రుజువయింది. ఇప్పుడు రాబోతున్న మరో సినిమాలో కూడా రెజీనా అందాలు బాగానే ఆరబోసినట్లు, ఆ సినిమాకు అది పెద్ద అట్రాక్షన్ అవుతుందని తెలుస్తోంది.

అడవిశేష్-రెజీనా జంటగా ఎవరు అని హర్రర్ టచ్ వున్న థ్రిల్లర్ రాబోతోంది. పివిపి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చేనెల 15న విడుదలవుతుంది. ఈ సినిమాలో రెజీనా చాలా హాటుగా, ఘాటుగా కనిపిస్తుందని తెలుస్తోంది.

తెలుగునాట ప్రస్తుతానికి రెజీనాకు అవకాశాలు తక్కువే వున్నాయి. ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తున్న రెజీనా తెలుగులో ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎవరు ఒక్కటే. యంగ్ హీరోల జమానా నడుస్తోంది ఇప్పుడు టాలీవుడ్ లో. వారిపక్కన రెజీనా కాస్త పెద్దగా కనిపిస్తుందనే భావనతో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంలేనట్లు కనిపిస్తోంది.

అడవిశేష్ గూఢచారి తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఎవరు సినిమాపై కాస్త మంచి ఆశలు వున్నాయి. దీన్ని మంచి రేట్లకు మార్కెట్ చేసారు కూడా.

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?