రాజధాని ఏర్పాటు అన్నది రాష్ట్ర పరిధిలోని అంశమేనని యువ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఈ విషయంలో న్యాయం కోరుతూ సుప్రీం కోర్టులో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని అన్న అంశాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ లో ప్రస్తావించడం జరిగింది అని గుడివాడ గుర్తు చేసారు.
అధికార వికేంద్రీకరణపై రాష్ట్రం చేసిన చట్టం చెల్లదన్న హైకోర్టు నిర్ణయాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లామని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యాంగం ప్రకారం రాజధాని నిర్ణయం అన్నది రాష్ట్ర పరిధిలోకి వస్తుందని ఆయన అన్నారు.
ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు న్యాయపరమైన అనుమతులు పొందడం కోసమే సుప్రీం కోర్టుకు వెళ్ళామని మంత్రి అన్నారు. ఒక విధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది మొదటి అడుగుగా భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.
మొత్తానికి గుడివాడ మాటలు బట్టి చూస్తే సుప్రీం కోర్టులో తగిన న్యాయం జరుగుతుందన్న ఆశాభావం కనిపిస్తోందని అంటున్నారు. మరో వైపు విపక్షాలకు ఈ నిర్ణయం షాకింగ్ గా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వం తనకు ఉన్న అవకాశాలను వాడుకునే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.