నందమూరి బాలకృష్ణతో దర్శకుడు చేయబోయే సినిమా స్టార్ట్ అయింది. సినిమా ప్రారంభమే ఫైట్ సీన్ తో. అలాగే అనౌన్స్ మెంట్ లోనే ‘బ్లడ్ బాత్ కు బ్రాండ్ నేమ్’…’వయిలెన్స్ కు విజిటింగ్ కార్డ్’ అని చెప్పేసారు కాబట్టి సినిమా ఏ దిశగా వుంటుందో ఊహించడం కష్టం కాదు. పైగా బాబీ కూడా ఫ్యాన్స్ కు ఏ కావాలో అవి ఇవ్వడానికే చూస్తారు ఎప్పుడూ.
వాల్తేర్ వీరయ్య విషయంలో అదే చేసారు హిట్ కొట్టారు. అందువల్ల బాలయ్యతో కూడా ఓ ఫక్తు మాస్ కమర్షియల్ అందించబోతున్నారనే అనుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఇంకా పెండింగ్ లో వుండనే వుంది. సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారు అన్నది.
బాలయ్యతో అఖండ, భగవంత్ కేసరి రెండు సినిమాలు చేసి హిట్లు ఇచ్చారు థమన్. అప్పటి నుంచి బాలకృష్ణకు ఇష్టుడపైపోయాడు. పైగా ఈ సినిమా నిర్మిస్తున్న సితార సంస్థకు, అందులో భాగస్వామి అయిన త్రివిక్రమ్ కూడా ఇష్టుడే. అందువల్ల థమన్ కు అడ్డం లేదు.
కానీ పేరు ప్రకటించలేదు.. ఎందుకున్నదే ప్రశ్న. దర్శకుడు బాబీ గతంలో థమన్ తో పని చేసారు. తరువాత దేవీశ్రీ ప్రసాద్ తో పని చేసారు. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా విజయం వెనుక దేవీశ్రీ ప్రసాద్ పాత్ర ఎంత వుందో తెలియంది కాదు. అందువల్ల మళ్లీ దేవీతోనే పని చేయబోతున్నారని ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి వార్తలు వస్తూ వున్నాయి.
అందువల్ల ఈ సినిమాకు కూడా దేవీశ్రీనే అనుకుని వుంటే ప్రకటించి వుండేవారు. కానీ అదీ లేదు. అంటే ఇంకా ఎవరు సంగీత దర్శకుడు అన్నది ఫిక్స్ చేయలేదు అన్నమాట. థమన్ నా, దేవీ శ్రీ ప్రసాద్ అన్నది ఆలోచిస్తున్నారా? లేక సినిమాను భారీ లెవెల్ కు తీసుకెళ్లాలని అనే ఆలోచనతో అనిరుధ్ నో ఇంకెవరినైనా తీసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే వేరే సంగతి.
అలా కాకుండా చిరకాలంగా దేవీశ్రీ ప్రసాద్ తో దూరంగా థమన్ తో దగ్గరగా వుంటున్న ఈ సినిమా భాగస్వామి త్రివిక్రమ్ వేరే విధంగా ఆలోచిస్తున్నారా? కొన్నాళ్లు ఆగితే కానీ ఏ సంగతి తెలియదు.