ఉప్పెన ట్రిమ్మింగ్ ప్రాసెస్ మొదలైంది

ఉప్పెన..సుకుమార్ రైటింగ్స్ పతాకంపై మైత్రీ మూవీస్ నిర్మించిన సినిమా. విడుదల కాస్త దగ్గరలోకి వచ్చిన టైమ్ లో కరోనా విరుచుకుపడింది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్…

ఉప్పెన..సుకుమార్ రైటింగ్స్ పతాకంపై మైత్రీ మూవీస్ నిర్మించిన సినిమా. విడుదల కాస్త దగ్గరలోకి వచ్చిన టైమ్ లో కరోనా విరుచుకుపడింది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు స్టార్ట్ అయ్యాయి. ఉప్పెన పని కూడా మొదలయింది.

సినిమాకు ఆర్ఆర్ కొంత వరకు జరగాల్సి వుంది. ఆపైన మిక్సింగ్, ఇతరత్రా వ్యవహారాలు మామూలే. ఇప్పటికే సినిమాలో రెండు పాటలు వదిలారు. నీ కన్ను నీలి సముద్రం పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో సినిమా ఫస్ట్ కాపీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు బోగట్టా.

సినిమాను వీలయినంత ట్రిమ్ చేసే కార్యక్రమం మొదలయింది. ఉప్పెన అవుట్ పుట్ ఎక్కువ వచ్చిందని, సినిమా ఫైనల్ కట్ రెండున్నర గంటల పైనే వచ్చిందని కరోనా ముందు వార్తలు వినవచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముందు ఆ కాపీని మరింత ఫైన్ ట్యూన్ చేసి, ట్రిమ్ చేసే పని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

సినిమా సమర్పకుడు డైరక్టర్ సుకుమార్, సినిమా డైరక్టర్ బుచ్చిబాబు, కలిసి సినిమాను వీలయినంత ట్రిమ్ చేసే పనిలో పడ్డట్టు బోగట్టా. ఈ ట్రిమ్ కార్యక్రమం ఇంకా మరి కొన్ని రోజులు పట్టే అవకాశం వుంది. ఇది అయిపోయాక అప్పుడు ఆర్ఆర్ బ్యాలెన్స్ వర్క్ పూర్తవుతుంది.

సినిమాను ఇప్పటికిప్పుడు విడుదల చేసే ఆలోచన అయితే నిర్మాతలలో లేదు. ఆగస్టు తరువాత అది అక్టోబర్ అయినా, డిసెంబర్ అయినా అన్ని విధాలా అనుకూలమైన డేట్ దొరికితేనే విడుదల చేస్తారు. అంతవరకు వేచి వుంటారు.

చంద్రబాబు రాజకీయానికి వారిద్దరూ బలయ్యారు