నా కోసం రష్మిక రాలేదు: విజయ్ దేవరకొండ

తను ఉన్నాను కాబట్టి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించడానికి రష్మిక ఒప్పుకోలేదని స్పష్టంచేశాడు హీరో విజయ్ దేవరకొండ. అదే సమయంలో.. రష్మిక పేరును తను ప్రతిపాదించలేదని, ఆమెను తీసుకోవాలనే నిర్ణయాన్ని యూనిట్ అంతా కలిసికట్టుగా…

తను ఉన్నాను కాబట్టి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించడానికి రష్మిక ఒప్పుకోలేదని స్పష్టంచేశాడు హీరో విజయ్ దేవరకొండ. అదే సమయంలో.. రష్మిక పేరును తను ప్రతిపాదించలేదని, ఆమెను తీసుకోవాలనే నిర్ణయాన్ని యూనిట్ అంతా కలిసికట్టుగా తీసుకుందని తెలిపాడు. నిజానికి తన సినిమాలకు సంబంధించి హీరోయిన్ ను ఎంపిక చేసే అంశాన్ని తను పట్టించుకోనని తెలిపాడు.

“ఫ్రెండ్స్ గురించి సినిమాలు చేయడం, ఫలానా హీరోయిన్ తోనే సినిమా చేయమని డిమాండ్ చేయడం లాంటివి జరగవు. మరీ ముఖ్యంగా నేను చేసే సినిమాల్లో అలాంటివి అస్సలు జరగవు. దర్శకుడితో పాటు అతడు చెప్పే స్క్రిప్ట్ నాకు నచ్చితే నేను సినిమా చేస్తాను. ఇంకేవీ పట్టించుకోను. నా సినిమాల్లో హీరోయిన్, ఆ పాత్రకు ఫిట్ అవ్వాలి. ఆ హీరోయిన్ దర్శకుడికి నచ్చాలి. నేను అంతవరకే చూస్తాను.”

గీతగోవిందం తర్వాత వెంటనే విజయ్-రష్మిక కలిసి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరికీ ఇలాంటి అనుమానాలొచ్చాయి. విజయ్ దేవరకొండ కావాలనే రష్మికను ప్రమోట్ చేస్తున్నాడంటూ పుకార్లు కూడా వ్యాపించాయి. పైగా సాయిపల్లవిని తప్పించి మరీ రష్మికకు ఈ ఛాన్స్ ఇచ్చారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. వీటిపై కూడా దేవరకొండ స్పందించాడు.

“డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ పాత్ర కోసం కేవలం ఇద్దర్ని మాత్రమే అనుకున్నాం. సాయిపల్లవి, రష్మిక మాత్రమే ఫిట్ అవుతారని భావించాం. వాళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ స్క్రిప్ట్ విన్నారు. ఇద్దరికీ బాగా నచ్చింది. రష్మిక వెంటనే సినిమా ఒప్పుకుంది. అలా డియర్ కామ్రేడ్ లో భాగమైంది.”

డియర్ కామ్రేడ్ లో నటించాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా ఆ హీరోయిన్లు మాత్రమే తీసుకున్నారని, వాళ్లపై తన ప్రభావం ఎంతమాత్రం లేదని అంటున్నాడు విజయ్ దేవరకొండ. అయితే కేవలం లిప్ కిస్సులు ఉన్నాయనే కారణంతోనే సాయిపల్లవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందంటూ కథనాలు వచ్చాయి.

టీజర్, ట్రయిలర్ రిలీజైన తర్వాత ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించలేదు. తనకు లిప్ లాక్ అనే పదం తనకు నచ్చదని, దాన్ని కూడా ఓ ఎమోషన్ గానే చూడాలని అన్నాడు విజయ్. ముద్దు అనేది మనిషి సహజసిద్ధ లక్షణమని దాన్ని పెద్దది చేసి చూడొద్దని రిక్వెస్ట్ చేశాడు. 

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు