Advertisement

Advertisement


Home > Movies - Movie News

'ఇస్మార్ట్'కు ఏ సర్టిఫికెట్

'ఇస్మార్ట్'కు ఏ సర్టిఫికెట్

ముందుగా ఊహించినట్లే రామ్ తో పూరి జగన్నాధ్ అందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. గురువారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఈ రోజు సెన్సారు జరిగింది. ఇస్మార్ట్ శంకర్ టీజర్, ట్రయిలర్ దగ్గర నుంచి ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వస్తుందని అంచనా వేస్తూనే వున్నారు అందరూ. పూరి - మహేష్ పోకిరి సినిమాకు కూడా అప్పట్లో ఏ సర్టిఫికెట్ నే. 

అలాంటిది ఫుల్ గా డబుల్ మీనింగ్ లు, డైరక్ట్ మీనింగ్ లు దట్టించిన ఇస్మార్ట్ శంకర్ కు ఎ కాకుండా మరో సర్టిఫికెట్ వస్తుందని ఎలా అనుకుంటారు? ఎవరైనా? పూరికి కూడా కావాల్సింది అదే. తానేం ఫ్యామిలీ మూవీ తీయలేదు. కుర్రకారు కోసం సినిమా తీసాడు. వాళ్లు రావడానికి ఏ సర్టిఫికేట్ ఏమీ అడ్డంకి కాదు. 

పూరి జగన్నాధ్ క్యాంప్ నుంచి అందుతున్నసమాచారం ప్రకారం ఈసారి కావాలనే ఆయన కాస్త ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తరువాత నుంచి సినిమాల్లో కాస్త ఘాటు పదాల వాడకం ఎక్కువయింది. వాస్తవానికి పూరి చాలా సినిమాల్లో ఎప్పుడో ఇలా ఘాటు పదాలు వాడారు. అందుకే ఈసారి మరింత డోస్ ఫెంచారు. దాంతో ఎ సర్టిఫికెట్ పక్కా అయింది.

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?