సందీప్ కు కాస్త మంచి రోజులు

నిను వీడని నీడను నేనే సినిమాతో నిర్మాతగా మారాడు హీరో సందీప్ కిషన్. ఒకటి, రెండు కాదు, ఆరేడు కోట్లు ఖర్చుచేసి సినిమా చేసాడు. పబ్లిసిటీకి కాస్త సినిమాకు మించే ఖర్చుచేసారు. అయితే సినిమా…

నిను వీడని నీడను నేనే సినిమాతో నిర్మాతగా మారాడు హీరో సందీప్ కిషన్. ఒకటి, రెండు కాదు, ఆరేడు కోట్లు ఖర్చుచేసి సినిమా చేసాడు. పబ్లిసిటీకి కాస్త సినిమాకు మించే ఖర్చుచేసారు. అయితే సినిమా విడుదలకు ముందే టేబుల్ పాఫిట్ చేసుకుంది. తమిళ వెర్షన్ 2.50 కోట్లకు విక్రయించడం, ఆంధ్ర 1.90కి ఇచ్చేయడం, హిందీ డబ్బింగ్ ద్వారా 1.70 కోట్లు రావడం, మ్యూజిక్ రైట్స్ ద్వారా 20లక్షలు, అన్నింటికి మించి డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా మంచి మొత్తం రావడంతో టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. నైజాం, ఓవర్ సీస్ ఓన్ గా విడుదల చేసుకున్నారు.

ఇప్పుడు విషయం ఏమిటంటే, ఆంధ్ర 1.90 వసూలు చేస్తే బయ్యర్లు కూడా సేఫ్ అవుతారు. విశాఖ 27 లక్షలకు ఇస్తే 27లక్షలు రావడం విశేషం. ఉత్తరాంధ్రలో తొలి మూడురోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన సందీప్ సినిమా ఇదే. కృష్ణజిల్లా తొలి వీకెండ్లో 17లక్షలకు ఫైగా వసూలు చేసింది, మరో పదిలక్షల వరకు రావాలి. ఇలా దాదాపు ఆంధ్ర ఏరియాలు అన్నీ దాని లెవెల్ కు స్టడీగానే వున్నాయి.

నైజాంలో ఓన్ రిలీజ్ చేసుకున్నారు, కోటిన్నర వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అది లాభంగా వుండిపోతుంది. కానీ ఓవర్ సీస్ మాత్రం ఫ్లాప్ అన్నది తప్పలేదు.

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు