Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరాకు పోటీ తగుల్తోంది

సైరాకు పోటీ తగుల్తోంది

మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ సైరా దసరా విడుదలకు రెడీ అవుతోంది. అక్టోబర్ 2 డేట్ అన్నది అనధికార సమాచారం. తెలుగునాట ఈ సినిమా గురించి చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అంత భారీ సినిమా వస్తుంటే మరే సినిమా కూడా పోటీకి దిగదు. కానీ అది కాదు సమస్య.

సైరా సినిమాను బాలీవుడ్ లో కూడా భారీగా విడుదల చేయాలన్నది ప్లాన్. పైగా సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా వున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో సైరాకు గట్టిపోటీ తగిలేలా వుంది. హృతిక్ రోషన్ వార్ సినిమా కూడా అక్టోబర్ 2న విడుదల.ఇప్పుడు ఆ సినిమా టీజర్ వచ్చింది. ఆ సినిమా స్టాండర్డ్ చూస్తుంటే చాలా హై లెవెల్ లో కనిపిస్తోంది. భారీతనం మాత్రమే కాకుండా, యాక్షన్ సీన్లు, ఛేజింగ్ లు ఇలా ఒకటేమిటి అన్నీ చాలా ఆసక్తికరంగా వున్నాయి.

ఇప్పుడు ఇలాంటి సినిమాతో సైరా సినిమా బాలీవుడ్ లో పోటీ పడాలి. ఇప్పటికి ఈ ఒక్క సినిమా మాత్రమే పోటీ కనిపిస్తోంది. మరి బరిలో ఇంకేం సినిమాలు రంగంలోకి దిగుతాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?