Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

సాహో... ఓ కార్ల కంపెనీ

సాహో... ఓ కార్ల కంపెనీ

భారీ సినిమాల వ్యవహారాలు వేరుగా వుంటాయి. బాహుబలి తీస్తే, కత్తులు, ఈటెలు వంటి ఆయుధాల ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది. బాహుబలి ప్రభాస్ సాహో సంగతి వేరు. ఇదంతా అల్ట్రా మోడరన్ జేమ్స్ బాండ్ సినిమా. ఛేజింగ్ లు, యాక్షన్ సీన్లు, అంతా, అదో లెవెల్.

సాహో సినిమా కోసం కార్లు విపరీతంగా వాడాల్సి వచ్చిందట. ముఖ్యంగా దుబాయ్ లో తీసిన ఛేజింగ్ సీన్ ప్రత్యేకమైనది. ఇంతకీ విషయం ఏమిటంటే, సాహో సినిమా కోసం చాలా కార్లు కొనాల్సి వచ్చిందని తెలుస్తోంది. సినిమా మొత్తానికి 120 కార్లు వాడారట. ఒక్క దుబాయ్ ఛేజింగ్ ఎపిసోడ్ లోనే 56 కార్ల వరకు వాడారట. ఈ సీన్ కోసం ఓ ప్రత్యేకమైన ట్రక్ ను స్వయంగా తయారు చేయించారు.

మరో యాక్షన్ సీన్ లో 18 కార్లు వాడారట. ఇదికాక సినిమాలోని మరికొన్ని సీన్లు అన్నీకలిపి 46 కార్లు వాడారని తెలుస్తోంది. సాహో సినిమాకు ముంబాయి, విదేశీ నిపుణలు పనిచేసారు. వీరి ఫీజులు, పారితోషికం అంతా కోట్లలోనే.

ఆగస్టు 15న విడుదలకు సిద్దమవుతున్న సాహో సినిమాకు సుజిత్ దర్శకుడు. వంశీ, ప్రమోద్ లు నిర్మాతలు.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?