‘బెల్లంకొండ’ స్వాతిముత్యం

బెల్లంకొండ గణేష్ తొలి సినిమా స్వాతిముత్యం. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలయింది. సినిమా టైటిల్ కు తగినట్లే హీరో క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ వివిధ సంఘటనల సమాహారంగా సాగింది…

బెల్లంకొండ గణేష్ తొలి సినిమా స్వాతిముత్యం. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలయింది. సినిమా టైటిల్ కు తగినట్లే హీరో క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ వివిధ సంఘటనల సమాహారంగా సాగింది టీజర్. 

హీరోయిన్ వర్ష బొల్లమ్మతో హీరో బాలయ్య (గణేష్) పరిచయం.. ప్రేమాయణం..అన్నీ టీజర్ లో చోటు చేసుకున్నాయి. సినిమా అంతా ఓ ఫన్ తో కూడిన యూత్ ఫుల్ లవ్ జర్నీలా వుంటుందని టీజర్ ఇండికేషన్ ఇచ్చింది. 

టీజర్ కలర్ ఫుల్ గావుంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ టోన్ లో వుంది. అంతా బాగానే వుంది కానీ టీజర్ కు మహతి స్వరసాగర్ ఇచ్చిన మ్యూజిక్ కాస్త సౌండ్ ఎక్కువైందనిపించింది. ఎంత ఎక్కువ అంటే డైలాగులను డామినేట్ చేసి, వినపడకుండా చేసేంత.

బెల్లంకొండ గణేష్ తన తొలిసినిమాను పక్కన పెట్టేసి ఈ సినిమా చేస్తున్నారు. అందువల్ల ఇదే తొలిసినిమా అనుకోవాలి. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు లక్షణ్. రావు రమేష్ హీరో తండ్రి, ప్రగతి హీరో తల్లిగా నటిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల అవుతోంది.