సినిమాను అమ్మవద్దన్న మెగాస్టార్

పెద్ద సినిమాలు అంటే బిజినెస్ ముందే జరిగిపోతుంది. పైగా కాంబినేషన్ ను బట్టి, క్రేజ్ ను బట్టి సినిమా రేటు ఆధారపడి వుంటుంది. సినిమా మీద మాంచి నమ్మకం, ఆర్థికంగా గట్టి మద్దతు వుంటే…

పెద్ద సినిమాలు అంటే బిజినెస్ ముందే జరిగిపోతుంది. పైగా కాంబినేషన్ ను బట్టి, క్రేజ్ ను బట్టి సినిమా రేటు ఆధారపడి వుంటుంది. సినిమా మీద మాంచి నమ్మకం, ఆర్థికంగా గట్టి మద్దతు వుంటే అమ్మకుండా ఓన్ రిలీజ్ చేసుకుంటారు. కానీ సాధారణంగా ఏ పెద్ద సినిమాను అమ్ముకునే అవకాశం వుంటే అలా చేయకుండా వుండరు. కానీ మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాను మాత్రం అమ్మాల్సి వున్నా, అమ్మకుండా విడుదల చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమాకు నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణ. ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను ఎక్కడా భారీ రేట్లకు అమ్మవద్దని, అడ్వాన్స్ ల మీద మాత్రమే విడుదల చేయమని హీరో మెగాస్టార్ చిరంజీవి నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్వీ ప్రసాద్ అంటే దాదాపు మెగాస్టార్ ఇంటి మనిషి కింద లెక్క. పైగా ఆయనకు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వుంది. అందుకే కేవలం అడ్వాన్స్ ల మీదనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఓవర్ సీస్ కూడా అదే పద్దతి.

కానీ అసలు మెగాస్టార్ ఇలా ఎందుకు చెప్పారన్నది క్వశ్చను. మెగాస్టార్ సైరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయింది. అయితే బయ్యర్లను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కానీ నిర్మాతగా చరణ్ నే ఎక్కవ నష్టపోయారు. తరువాత వచ్చిన ఆచార్య సినిమా అలా కాదు. దాన్ని మాంచి రేట్ల అమ్మారు. బయ్యర్లంతా కుదేలయిపోయారు. దాని మీద నానా గడబిడ జరిగింది. బయ్యర్లు వచ్చి కొరటాల ఆఫీసు మీద కూర్చుని నానా రగడ చేసారు.

మరి ఈసారి ఇలాంటి తలకాయ నొప్పులు ఎందుకు అని అనుకున్నారో? సినిమా హిట్ అయితే ఎలాగూ డబ్బులు వస్తాయి, నేరుగా విడుదల చేసుకుని, వసూలు చేసుకోగల సత్తా నిర్మాత ఎన్వీప్రసాద్, ఆర్బీ చౌదరికి వుంది, అందువల్ల అమ్మడం, తరువాత బయ్యర్లకు లాభం, నష్టం అనే వార్తలు అన్నీ ఎందుకు అని ముందుగా ఆలోచించారో, మొత్తానికి మెగాస్టార్ ఇలా అడ్వాన్స్ ల మీదనే విడుదల చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.