దర్శకుడిగా నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మించిన కమర్సియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి పాత్రికేయులతో ముచ్చటించారు.
నా మొదటి సినిమా ఇది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అలాగే అండర్ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని విత్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డిస్కస్ చేశాం.ఈ సినిమా చూసిన ప్రతి అమ్మాయి, ప్రతి ఫ్యామిలీ అడియన్స్ అందరూ రియాక్ట్ అవుతారు.
అలాగే ఫాదర్, డాటర్ మధ్యలో ఉండే రిలేషన్ షిప్ ను ఎలివేట్ చేశాము. ఈ సినిమాలో తక్కువ పాత్రలు ఉన్నా అడియన్స్ కు కొత్త పాత్రలు ఉంటే బాగా కనెక్ట్ అవుతారనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి , కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ లను తీసుకోవడం జరిగింది. మేము అనుకున్నట్లే కిరణ్ అబ్బవరం, బాబా భాస్కర్ ల ట్రాక్ లతో పాటు ఎస్. వి కృష్ణారెడ్డి, సంజనల ఎమోషన్స్ బాగా కుదిరాయి.
మణి శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆరు అద్భుతమైన వెరియేషన్స్ ఉన్న పాటలు ఇచ్చారు. అలాగే ఆయనిచ్చిన ఆర్ ఆర్ ఈ సినిమాకు మరొ హైలెట్ అవుతుంది.. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేశాడు. డైలాగ్స్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అవుతాయి. పవన్ కల్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసి, మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.
చిన్నప్పటి నుండి నాకు డైరెక్షన్ అంటే ఇష్టం.నేను నాన్న గారు ఉన్నపుడే నేను 2,3 కథలు రెడీ చేసుకున్నాను. భవిష్యత్తులో నా దర్శకత్వంలో సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన పది రోజుల తర్వాత మళ్ళీ మంచి సినిమాతో మీ ముందుకు వస్తాను. అని ముగించారు.