ఈట‌ల క్షమాపణ.. సస్పెండ్!

బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుండి స‌స్పెండ్ చేశారు. ఈ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పొచ‌రం శ్రీనివాస రెడ్డి ప్ర‌క‌టించారు.  Advertisement స్పీక‌ర్ పై…

బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుండి స‌స్పెండ్ చేశారు. ఈ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పొచ‌రం శ్రీనివాస రెడ్డి ప్ర‌క‌టించారు. 

స్పీక‌ర్ పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి స‌భ‌లో కొన‌సాగాల‌ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఈట‌ల‌ క్ష‌మ‌ప‌ణ చెప్ప‌డానికి నిరాక‌రించ‌డంతో.. మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి స‌స్పెన్ష‌న్ తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌గా స‌భ ఆమోదించింది. దీంతో స‌భ‌ను వీడాల‌ని స్పీక‌ర్ వెల్ల‌డించారు. స‌స్పెన్ష‌న్ అనంత‌రం ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌డంతో పోలీసులు అడ్డుకొని ఆరెస్టు చేశారు.

అంత‌కు ముందు మీడియా స‌మావేశంలో ఈట‌ల మట్లాడుతూ.. స్పీక‌ర్ మ‌ర మ‌నిషి లాగా ప‌ని చేస్తున్న‌రంటూ అధికార పార్టీకి చెప్పినట్లు న‌డుచుకుంటున్నార‌ని స్పీక‌ర్ పోచ‌రం పై హాట్ కామెంట్స్ చేశారు. త‌రువాత మ‌ర మ‌నిషి అనే ప‌దం త‌ప్పు కాదంటూ త‌న‌కు త‌నుగా స‌మ‌ర్ధించుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ముగ్గురు బీజేపీ స‌భ్యుల్లో రాజా సింగ్ పార్టీ ఇప్ప‌టికే పార్టీ నుండి స‌స్పెండ్ అయి, ఒక వ‌ర్గం వారిపై అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో జైలో ఉన్నారు. ఉన్న ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేలో ఒక‌రు స‌స్పెండ్ అవ్వ‌డంతో ఈ సారి స‌మావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో క‌న‌ప‌డక‌పోవ‌చ్చు.